Telangana Elections 2023 : భారతీయులకు బాగా ఇష్టమైన వ్యాపకాలు సినిమా, క్రికెట్. అస్సలు నచ్చని విషయం రాజకీయాలు. ఈ విషయం మరోసారి రుజువైంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. ‘యానిమల్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీకి హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.6.5 కోట్లు వచ్చినట్టు సమాచారం.
అభ్యర్థులను ఓటుకి నోటు డిమాండ్ చేస్తున్న సాధారణ జనం… ఇది కదా డెవలప్‌మెంట్..
అలాగే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లో ఓడినా, ఇండియా- ఆస్ట్రేలియా టీ20 మ్యాచులు చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే భవిష్యత్తు మార్చేందుకు పౌరుల ప్రాథమిక హక్కుగా వినియోగించుకోవాల్సిన ఓటు హక్కు విషయంలో మాత్రం అదే బద్ధకం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. చదువుకున్న వాడి కంటే చదువులేని వాడే బెటర్ అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అందరూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటే మహా నగరాల్లో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో మధ్యాహ్నం 1 గంట వరకూ కూడా పోలింగ్ శాతం 15 కూడా దాటలేదు.. హైదరాబాద్‌లో 12.39 శాతం, రంగారెడ్డిలో 16.83 శాతం, మేడ్చల్‌లో 14.74 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
వాచీలు, క్రికెట్ కిట్స్, చీరలు.. ప్రచారం ఆగింది, పంపకాలు మొదలయ్యాయి!
నాంపల్లి నియోజిక వర్గంలో అయితే 0.5 శాతం మాత్రమే నమోదు కావడం విశేషం. చూస్తుంటే ఇక్కడ సాయంత్రం కల్లా పోలింగ్ శాతం 20-25 దాటడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. సనత్ నగర్‌లో 1.2 శాతం పోలింగ్ నమోదు కాగా ధనవంతులు, సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి ఏరియాలో 1.9 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత తగ్గేలా కనిపిస్తోంది. ఓవరాల్‌గా తెలంగాణలోని మొత్తం 119 నియోజిక వర్గాల్లో పోలింగ్ శాతం 60 దాటడం కూడా కష్టమే.
‘యానిమల్’ కోసం 500 కేజీల మిషన్ గన్.. ఈ సెంటిమెంట్ తేడా కొట్టిందో..