ఆడు మగాడ్రా బుజ్జి! సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిపై గెలిచిన వెంకటరమణా రెడ్డి..

Telangana Election Results 2023 : ఓ పక్క 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీఎం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. ఇద్దరూ పోటీలో నిలిస్తే, మిగిలిన వాళ్లు డిపాజిట్లు కూడా దక్కవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే కామారెడ్డి ప్రజలు మాత్రం ఊహించని రిజల్ట్ ఇచ్చారు.

ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్‌ఎస్‌ని ముంచిందా..!?

కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడిస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి, 11 వేల భారీ మెజారిటీతో విజయం అందుకున్నాడు. మొదటి రౌండ్ నుంచి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగిన ఆధిక్యం.. 10వ రౌండ్ తర్వాత బీజేపీ వైపు మళ్లింది.

Telangana Election Results 2023

మొదటి రౌండ్‌లో రేవంత్ రెడ్డికి ఆధిక్యం దక్కింది. నాలుగు రౌండ్ల వరకూ రేవంత్ లీడ్‌లో ఉన్నారు. కేసీఆర్‌కి షాక్ తప్పదని అనుకుంటుండగా ఐదో రౌండ్‌లో కేసీఆర్‌కి ఆధిక్యం దక్కింది. అయితే బీఆర్‌ఎస్ కార్యకర్తల సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.

తెలంగాణ పోరు! రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటినా మా రాతలు మారలేదు దొరా..!

10వ రౌండ్ తర్వాత అన్యూహ్యంగా లీడ్‌లోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి, ఆ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయి 11 వేల మెజారిటీతో విజయాన్ని అందుకున్నాడు. రేవంత్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా సీఎం కేసీఆర్ మూడో స్థానంలో నిలిచాడు. ఈసారి ఏకంగా కామారెడ్డి 39 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 75.58 శాతం పోలింగ్ నమోదైంది.

కామారెడ్డి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంపా గోవర్థన్‌, స్వయంగా తన నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీచేయాలని కోరారు. ఆ కోరిక, కేసీఆర్ ఓటమికి కారణమైంది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై గెలిచిన అభ్యర్థిగా వెంకటరమణా రెడ్డి చరిత్ర సృష్టించారు.

క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post