Telangana Election Results 2023 : ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. రాజకీయాలు కూడా వార్‌తో సమానమే. అందుకే గెలిచేందుకు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ 39 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.
ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్‌ఎస్‌ని ముంచిందా..!?
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి మంచి ఆధిక్యం నిలవగా, దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ జోరు కొనసాగింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ దక్కించుకున్న కాంగ్రెస్, సంబరాలు చేసుకుంటోంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఓ బీఆర్‌ఎస్ అభ్యర్థి వ్యవహరించిన విధానం తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పాడి కౌషిక్ రెడ్డి, తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ప్రచారంలో కౌషిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై, సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. కౌషిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే అక్కడ అతని ప్రత్యర్థి ఈటెల రాజేందర్..
ఆడు మగాడ్రా బుజ్జి! సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిపై గెలిచిన వెంకటరమణా రెడ్డి..
2004 నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటెల రాజేందర్, గతంలో మంత్రిగా కూడా సేవలు అందించారు. అయితే 2021లో భూఆక్రమణల కేసులో ఆరోపణలు రావడంతో బీఆర్‌ఎస్ పార్టీ, ఈటెల రాజేందర్‌ని సస్పెండ్ చేసింది. దీంతో ఆయన, బీజేపీలో చేరాడు. బై ఎలక్షన్స్‌లో కూడా ఘనమైన మెజారిటీతో గెలిచాడు.
మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటెల రాజేందర్‌కి ప్రత్యర్థిగా నిలబడితే, ఓడిపోతామనే భయం ఉండడం ఖాయం. దీంతో ఎలాగైనా గెలవాలని ఈ వ్యాఖ్యలు చేశాడు కౌషిక్ రెడ్డి. అయితే ఎన్నికల ఫలితాల్లో ఈటెల రాజేందర్‌పై 17 వేల మెజారిటీతో ఘన విజయం అందుకున్నాడు కౌషిక్. కౌషిక్‌కి వర్కవుట్ అయ్యింది కదా అని ఇకపై ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లంతా ఇలా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తే.. పరిస్థితి ఏంటో!
తెలంగాణ పోరు! రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటినా మా రాతలు మారలేదు దొరా..!