Telangana Election Results 2023 : పార్టీ పెట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన తీసుకున్న అతి పెద్ద వ్యూహాత్మిక తప్పిదంగా నిలిచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 8 నియోజిక వర్గాల్లో ఏడింట్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు జనసేన అభ్యర్థులు..
ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్‌ఎస్‌ని ముంచిందా..!?
అశ్వరావుపేట నియోజిక వర్గంలో నోటాకి 699 ఓట్లు వస్తే, దాని కంటే 101 ఓట్లు మాత్రమే ఎక్కువగా సాధించింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి, సభ నిర్వహించిన కూకట్‌పల్లి నియోజిక వర్గంలో మాత్రం మూడో స్థానంలో నిలిచింది జనసేన. మిగిలిన 7 సార్లు, నోటాతో పోటీపడి ఓట్లు దక్కించుకున్నారు జనసేన అభ్యర్థులు..
తెలంగాణలో జనసేన పార్టీకి స్వంత క్యాడర్ లేదు. ఆంధ్రాపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో పార్టీని విస్తరించే ప్రయత్నం చేయలేదు. సడెన్‌గా ఎన్నికలకు 10 రోజుల ముందు జనసేన పార్టీ 32 నియోజిక వర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు. అయితే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో 32 కాకుండా 8 నియోజిక వర్గాల్లో మాత్రం జనసేన పోటీలో నిలిచింది.
ఎన్నికలకు 10 రోజుల ముందు జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తే, జనాలు ఎందుకు పట్టించుకుంటారు? అందుకే గ్లాసులో ఓట్లు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు 3 నెలల ముందు తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్, అక్కడి జనసేన పార్టీలో ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రమాదం ఉంది.
ఇది ముందుగానే ఊహించిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. టీడీపీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉంది. అలాంటి తెలుగుదేశం పార్టీయే రిజల్ట్ ముందుగానే ఊహించి, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంటే.. జనసేన పార్టీ మాత్రం తొందర పడి పరువు తీసుకున్నట్టైంది.
ఈ స్టార్స్.. ఆరోగ్యానికి హానికరం..