Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పార్టీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్‌ఆర్ షర్మిల పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నాయి. నవంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే తెలంగాణలో జనసేన పార్టీకి ‘ఛాయ్ గ్లాసు’ గుర్తు కేటాయించేందుకు ఎలక్షన్ కమిషన్ నిరాకరించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ షాకింగ్ కామెంట్స్..
ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఓ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించాలంటే ఆ రాష్ట్రంలో సదరు పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన జనసేన, తెలంగాణపై దృష్టి సారించలేదు. 2021 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ, ‘గాజు గ్లాస్’ గుర్తును కోల్పోయింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినా, ఒక్క స్థానంలోనూ నెగ్గలేకపోయింది. దీంతో ప్రాంతీయ పార్టీ గుర్తింపు కోల్పోయిన జనసేన పార్టీ, ఈసారి ఎలక్షన్లలో పోటీలో నిలిచింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్.
ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
అయితే తెలంగాణలో జనసేన పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించేందుకు ఎలక్షన్ కమిషన్ నిరాకరించిందని, తెలంగాణలో పోటీ చేసే జనసేన అభ్యర్థులు అందరూ స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీలో ఉంటారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇందులో వాస్తవం లేదు. జనసేన పార్టీకి గ్లాసు గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. అయితే జాతీయ జన సేన పార్టీ పేరుతో ఓ పార్టీ, తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇది జనసేన పార్టీకి పెద్ద దెబ్బే. ఈ పార్టీ గుర్తు బకెట్. గుర్తులు దగ్గరగా ఉండడం, పేర్లు ఒక్కటిగా ఉండడంతో ఓటర్లు పొరబడే అవకాశం ఉంది.