Telangana Assembly Election Result 2023 : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది. రెండుసార్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, కాంగ్రెస్‌కి స్పష్టమైన మెజారిటీ కట్టచెప్పారు తెలంగాణ ప్రజలు. 2 నెలల కిందటి వరకూ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఓడిపోతుందని అని ఎవ్వరూ అనుకోలేదు.
తెలంగాణ పోరు! రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటినా మా రాతలు మారలేదు దొరా..!
అయితే ఎన్నికల సైరన్ మోగిన తర్వాత లెక్కలు మొత్తం మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ వాగ్దానాలే. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, ఎకరాకి రూ.15 వేల రైతు బంధు వంటి 6 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్, వాటిని జనాల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.
దొంగ చేతికి తాళాలివ్వడం అంటే ఇదే..
రాష్ట్రాన్ని దాదాపు 10 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అభివృద్ధిని చూపించి, జనాలను ఆకర్షించాలని అనుకుంది. ‘ఎట్లుండే తెలంగాణ, ఎట్లైంది మన తెలంగాణ’ అంటూ సెలబ్రిటీలతో పెయిడ్ వీడియోలు చేయించింది. అలాగే ఎమ్మెల్యేలతో కలిసి ప్రాసలతో చేసిన ప్రమోషన్లు కూడా జనాలకు పెద్దగా ఎక్కలేదు. అభివృద్ధి కంటే సంక్షేమమే, రిజల్ట్‌ని నిర్ణయిస్తుందని మరోసారి రుజువైంది.