10 ఏళ్లుగా నాకౌట్ భయం! ఈసారి అయినా దాటుతారా… 2014 నుంచి అదే తీరు..

India vs New zealand world cup semi final
India vs New zealand world cup semi final

India vs New zealand world cup semi final : వన్డే ప్రపంచ కప్‌ 2023 టోర్నీలో భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది. లీగ్ స్టేజీలో అన్ని టీమ్‌లను ఓడించి, టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది. అంతా బానే ఉంది కానీ అభిమానుల్లో అదే భయం.. ఎందుకంటే టీమిండియా ఇలా లీగ్ స్టేజీల్లో అదరగొట్టడం ఇదే తొలిసారి కాదు.

Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..

2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత గత పదేళ్లలో ఆరుసార్లు ఐసీసీ టోర్నీల్లో టేబుల్ టాపర్‌గా నిలిచినా… టైటిల్ నెగ్గలేకపోయింది భారత జట్టు. 2014 టీ20 వరల్డ్ కప్, 2015 వన్డే ప్రపంచ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్.. ఇలా ఆరు సార్లు టేబుల్ టాపర్‌గా సెమీస్, ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్‌ని మాత్రం నెగ్గలేకపోయింది..

India vs New zealand world cup semi final

ఈసారి భారత జట్టు ఇస్తున్న ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నా… అసలు ఆట వచ్చేసరికి ఇలాగే ఆడతారా? అనేదే అసలు భయం. లీగ్ స్టేజీలో దుమ్మురేపుతున్న విరాట్, రోహిత్, శుబ్‌మన్… సెమీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఇలాగే ఆడతారా?

ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ… నాకౌట్ మ్యాచుల్లో ఇలాగే బౌలింగ్ చేస్తారా? లేక 2022 టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చేసిన తప్పులే చేస్తారా? టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న విషయాలు ఇవే.. ఈసారి మిస్ అయితే మాత్రం, భారత జట్టు మళ్లీ తేరుకోవడానికి ఇంకో దశాబ్ద కాలం పట్టొచ్చు..

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post