TDP – Janasena : ఏపీ పాలిటిక్స్ రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఏపీలో ఈసారి తెలుగుదేశం-జనసేన కూటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. రెండు దశాబ్దాల నుంచి పెద్దగా పట్టు లేని నెల్లూరు జిల్లాలో కూడా ఈసారి టీడీపీ గాలి బలంగా వీయబోతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే జగన్ కంచుకోట కూలినట్టే.. 2004 నుంచి గత 20 ఏళ్లల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి గెలుపు దక్కలేదు.
2004 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తులో బలంగా భారతీయ జనతా పార్టీకి సీటు ఇచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 54 శాతం ఓటు షేర్‌తో గెలుపు దక్కించుకోగా, బీజేపీ అభ్యర్థికి 38 శాతం ఓట్లు దక్కాయి. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజామోహన్ రెడ్డికి ఓటు షేర్ 43 శాతానికి దక్కినా, టీడీపీ 37 శాతానికే పరిమితమైంది. ప్రజారాజ్యం అభ్యర్థికి 14 శాతం ఓట్లు దక్కడం టీడీపీ విజయాన్ని అడ్డుకుంది.
Dhanush : ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్..
2012 బై ఎలక్షన్స్‌తో మేకపాటి రాజామోహన్, పార్టీ మారి వైఎస్ఆర్ సీపీలో చేరాడు. ఈసారి అతనికి 55 శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్‌కి 25 శాతం, టీడీపికి 16 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2014 ఎన్నికల్లో మేకపాటి 48.5 శాతం ఓట్లతో గెలుపు దక్కించుకోగా టీడీపీ తరుపున పోటీ చేసిన ఆడాల ప్రభాకర్ రెడ్డి 47.4 శాతం ఓట్లు తెచ్చుకుని స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
2019లో ఆడాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి 53 శాతం ఓట్లు దక్కించుకున్నాడు. టీడీపీ నుంచి పోటీ చేసిన బీడా మస్తాన్‌కి 40 శాతం ఓట్లు దక్కాయి. 2024లో వైసపీ తరుపున లోక్‌సభ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, తెలుగుదేశం నుంచి వామి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి వైసీపీ ఓటమికి తప్పదని లెక్కలు చెబుతున్నా, టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడం మైనస్సే..
నెల్లూర్‌లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు నియోజిక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీటిల్లో 5 స్థానాల వరకూ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Credit : HariKrishna