Tamil Actor Vijay : కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళక వెట్రి కజగం పేరుతో పొలిటికల్ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం అవుతానని ప్రకటించి, ఆశ్చర్యపరిచాడు విజయ్.
Animal Movie Trolls : ‘యానిమల్’ మూవీని కార్నర్ చేస్తున్న తమిళులు..
ప్రస్తుతం కోలీవుడ్‌గా టాప్ హీరోగా ఉన్నాడు తలపతి విజయ్.. అజిత్ కుమార్, విజయ్ ఇద్దరిలో ఎవరు టాప్ హీరో అనే విషయంపై తమిళ్ సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే విజయ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులతో పోలిస్తే, అజిత్ బాక్సాఫీస్ స్టామినా తక్కువగా ఉంది. కాబట్టి విజయ్‌ని కోలీవుడ్ ప్రెజెంట్ టాప్ హీరోగా చెప్పొచ్చు. అలాంటి విజయ్, ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇచ్చిన ప్రకటన, ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే తమిళ్లో హీరోలు పార్టీలు ప్రకటించడం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, విజయకాంత్, రజినీ, కమల్ ఇలా అందరూ రాజకీయ పార్టీలను ప్రకటించిన వాళ్లే.. కమల్ హాసన్ ‘మక్కల్ నీది మైగం’ పేరుతో పార్టీని ప్రకటించాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 180 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ, ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ‘రజినీ మక్కల్ మంద్రం’ పేరుతో పార్టీ స్థాపించాడు. అయితే అనారోగ్య కారణాలతో తన రాజకీయ పార్టీని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు.. మరి విజయ్ పార్టీ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.