మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత..

Suspension of former DGP Anjani Kumar revoked : తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెల్సిందే. తాజాగా అంజనీ కుమార్ పై సస్పెన్షన్‌ను రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు. పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.

బహిష్కరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మోయిత్రా..

ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. డీజీపీ చర్యలు జూనియర్ అధికారులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఈసీఐ ఈ సమావేశాన్ని స్పష్టమైన కోడ్ ఉల్లంఘనగా పరిగణించింది. అయితే దీనిపై ఈసీకి అంజనీ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, ఇలా మరోసారి జరగదని ఆయన ఈసీకి హామీ ఇచ్చారు.

వచ్చే పదేళ్ళలో గౌతమ్ ఆదానీ ₹7 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..

దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భారత ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంజనీ కుమార్ సస్పెన్షన్ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాకు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post