Super Star Krishna : ఇప్పుడు స్టార్ హీరోలు, మూడేళ్లకి ఓ సినిమా రిలీజ్ చేయడానికే తెగ కష్టపడిపోతున్నారు. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది రెండే సినిమాలు. మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ, ఏడాదికి 11 సినిమాలు చేసేవారు. ఒకే ఏడాదిలో 18 సినిమాలు రిలీజ్ చేసి, సంవత్సరంలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన తెలుగు హీరో రికార్డు కూడా సొంతం చేసుకున్నారు కృష్ణ. 1972లో కృష్ణ నటించిన 18 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అంటే ఓ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు కూడా కాకముందే మరో సినిమా థియేటర్లలోకి వచ్చేది..
ఎన్టీ రామారావు సినిమాలకు మార్కెట్ తగ్గుతున్న సమయంలో మాస్‌లో, యూత్‌లో కృష్ణకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌ని చేతుల్లో ఒడిసి పట్టుకోవాలని వచ్చిన సినిమాలను వచ్చినట్టుగా సైన్ చేస్తూ పోయాడు కృష్ణ. రోజుకి మూడు షిఫ్ట్‌లు చేస్తూ, 18 గంటల పాటు షూటింగ్‌లోనే గడిపేవాడు కృష్ణ. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కృష్ణకి స్టోరీ వినే సమయం కూడా ఉండేది కాదు.. దీంతో తన కాల్షీట్లు, సినిమాల సెలక్షన్ బాధ్యతలను ఓ ఫ్రెండ్‌కి అప్పగించారు కృష్ణ..
Pawan Kalyan Remake : పవన్ తో ఆ సినిమా కోసం సుజిత్‌ని పిలిచిన గురూజీ..
మొదట్లో బాగానే నడిచినా, తర్వాత కృష్ణ పాపులారిటీ, క్రేజ్‌ని చూసి ఆ స్నేహితుడికి ఆశ పుట్టింది. దీంతో కృష్ణ డేట్స్‌కి ఎక్కువ ధరకు కొందరు బీ గ్రేడ్ నిర్మాతలకు అమ్మారు. కృష్ణ, ఫలానా సెట్‌లో ఫలానా సినిమాలో ఫలానా సీన్ చేయాలనే విషయం మాత్రమే తెలుసుకుని షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. దీంతో కృష్ణ ఉండే సీన్స్‌లో మాత్రం బూతు సన్నివేశాలు లేకుండా డమ్మీ పోర్షన్ పెట్టేవాళ్లు. మిగిలిన సినిమా అంతా బూతు బాగోతం నడిచేది..
ఇలా కృష్ణ పోస్టర్లతో కొన్ని బూతు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ విషయం అభిమానుల ద్వారా కృష్ణకి తెలిసింది. దీంతో కృష్ణ, అప్పటిదాకా మేనేజర్‌గా ఉన్న తన స్నేహితుడిని తీసేశాడు. అయితే ఇప్పటికీ కృష్ణ నటించిన ఆ బూతు సినిమాలు మాత్రం యూట్యూబ్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఆ అనుభవంతో ఒకానొక దశలో ఏడాదికి 14కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత కథలను ఆచి తూచి ఎంచుకుంటూ ఏడాదికి 11 సినిమాలు చేస్తూ వచ్చారు.
1990 నుంచి కృష్ణ నటించే సినిమాల సంఖ్య ఏడాదికి 4-5కి తగ్గిపోయింది. వయసు పెరిగిన తర్వాత స్టార్ ఇమేజ్‌ని పక్కనబెట్టి ‘ఒసేయ్ రాములమ్మ’, ‘సుల్తాన్’, ‘రవన్న’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు కృష్ణ..