Sundaram Master Review : యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుని, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు వైవా హర్ష. హర్షగా హీరోగా మారి, హీరో రవితేజ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఒక్కరోజు ముందే ప్రీమియర్స్ పడ్డాయి.
Vishwa Hindu Parishath : సీతతో అక్బర్‌ని ఎలా జోడి కడతారు! కోర్టుకెక్కిన విశ్వ హిందూ పరిషత్..
ట్రైలర్‌లోనే చూపించినట్టుగానే మిర్యాలమెట్ట అనే తాండకి టీచర్‌గా వెళ్తాడు సుందరం మాస్టర్. ఇంగ్లీష్ సరిగా రాని సుందరం మాస్టర్, ఊరి జనాలకు ఇంగ్లీష్ నేర్పించడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు? సుందరం వచ్చిన పని అదేనా? లేక వేరే పని మీద ఆ గ్రామానికి వచ్చాడా? ఇదే ఈ సినిమా కథ..
ఇలాంటి కథలతో, 80’s కొన్ని సినిమాలు వచ్చాయి. ఫస్టాఫ్ కామెడీతో, సెకండాఫ్ ఎమోషన్స్‌తో నింపేశాడు డైరెక్టర్.. డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్‌లో కాస్త క్లారిటీ మిస్ అయినట్టే అనిపిస్తుంది. దీంతో సెకండాఫ్ చాలా సాగుతుంది. హర్ష కామెడీ టైమింగ్, హీరోయిన్ మారిన దివ్య శ్రీపాద క్యూట్‌నెస్ ఆకట్టుకున్నా.. కథనంలో స్పీడ్ లేకపోవడంతో జనాలు బాగా డిస్సప్పాయింట్ అవుతారు.
శ్రీచరణ్ పాకాల మంచి మ్యూజిక్ అందించాడు. ప్రీ క్లైమాక్స్‌లో కథలో ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయినట్టే అనిపించినా, క్లైమాక్స్ అందరూ ముందే ఊహించేస్తారు. కథ బాగున్నా, దాన్ని తెర మీద ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించడంలో దర్శకుడు కళ్యాణ్ సంతోషం అనుభవలేమి కనిపించింది. మొత్తానికి సుందరం మాస్టర్‌కి కామెడీలో పాస్ మార్కులు వచ్చినా, మ్యాథమేటిక్స్‌లో మాత్రం 10 మార్కులే వచ్చాయి.
Vijay Sethupathi : ఆ మాట మీద నిలబడిన విజయ్ సేతుపతి.. అందుకే రామ్ చరణ్ మూవీ నుంచి అవుట్..