Summer Effect on Movies : సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ మూవీ కారణంగా ఎప్పుడో మూతబడిన 500 థియేటర్లు తిరిగి తెరవబడి, పూర్వ కళను అందుకున్నాయి. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్లు దొరకక ‘హనుమాన్’ మూవీని చూడడానికి చాలా ఏళ్ల తర్వాత థియేటర్లకు క్యూకట్టారు జనాలు. దీంతో చాలా ఏళ్ల తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు జనాలతో కళకళలాడాయి. అయితే ఈ వైభవం నాలుగు నెలలకే ముగిసిపోయింది.
మార్చి 29న విడుదలైన ‘టిల్లు స్క్వైర్’ మూవీ మిక్స్‌డ్ టాక్‌తోనే రూ.125 కోట్లు వసూలు చేసింది. కారణం ఈ మూవీకి సరైన పోటీ లేకపోవడమే. అయితే ఏప్రిల్ నుంచి సినిమాలకు కలెక్షన్లు కరువయ్యాయి. విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా, జనాలు పట్టించుకోలేదు. ఎండలకు జనాలు బయటికి రావడానికే భయపడుతుండడంతో ఏప్రిల్ రెండో వారం నుంచే పెద్దగా సినిమాలు కాలేదు. ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాతి వారంలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘లవ్ గురు’ వంటి ఒకటి రెండు గుర్తింపు ఉన్న స్టార్ల సినిమాలు వచ్చాయి.
OTT Movies in May : ‘మే’లో అలరించనున్న ఓటీటీ చిత్రాలు..
ఆ తర్వాత మూడు వారాల్లో ఒక్క సినిమా కూడా జనాల అటెన్షన్ దక్కించుకోలేకపోయింది. విశాల్ హీరోగా వచ్చిన ‘రత్నం’ మూవీ కూడా జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. మొత్తంగా ఏప్రిల్ నెలలో ఒక్క సినిమా కూడా హిట్టు స్టేటస్ దక్కించుకోలేదు. సరైన సినిమాలు రిలీజ్ కాకపోవడం, ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆంధ్రాలో దాదాపు 70 శాతం థియేటర్లు మూతబడ్డాయి. చిన్నచితకా సినిమాలు చూసేందుకు వస్తున్న జనాల వల్ల వచ్చే టికెట్ డబ్బులు, కరెంటు బిల్లుకు కూడా సరిపోకపోవడంతో తాత్కాలికంగా థియేటర్లను మూసి వేశారు యజమానాలు..
మే 3న అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ రిలీజ్ ఉంది. అలాగే సుహాస్ ‘ప్రసన్నవదనం’ మూవీతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలనైనా థియేటర్లకు జనాలను రప్పించగలుగుతాయో లేదో చూడాలి. లేదంటే ఆ తర్వాత మే 17న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ వరకూ, అది కూడా పోతే జూన్‌లో వచ్చే ‘కల్కి’ మూవీ వరకూ ఇదే రకమైన పరిస్థితి కొనసాగొచ్చు..