Suhas Hattric : బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాస్, హీరోగా హ్యాట్రిక్ కొట్టేశాడు. విభిన్నమైన కథాంశాలతో ఒక్కో సినిమా చేసుకుంటూ పోతున్న సుహాస్, ‘కలర్ ఫోటో’ మూవీతో క్లాసిక్ హిట్టు కొట్టాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. గత ఏడాది ‘రైటర్ పద్మభూషణ్’ పేరుతో ఫ్యామిలీ స్టోరీతో జనాలకు చేరువైన సుహాస్, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు.
Guntur Kaaram OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మహేష్ గుంటూర్ కారం..
జనవరి 2న విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో బ్యాండు మోత ఎక్కువైందని, అసలు కథ గాడి తప్పిందని మిక్స్డ్ రివ్యులు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోని జనం, సుహాస్‌కి హిట్టు ఇచ్చేశారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ‘హనుమాన్’ తప్ప, మిగిలిన సినిమాలన్నీ వారానికే బాక్సులు సర్దుకున్నాయి. దీంతో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీకి పెద్దగా పోటీ లేకుండా పోయింది..
ఫిబ్రవరి 2న ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’తో పాటు బిగ్ బాస్ సోహైల్ ‘బూట్ కట్ బాలరాజు’, ‘కిస్మత్’,‘హ్యాపీ ఎండింగ్’ వంటి మరో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అవన్నీ డిజాస్టర్లుగానే మిగిలాయి. ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా చూడమని సోహైల్, మీడియా ముందుకు వచ్చి ఏడ్చి, కన్నీళ్లు పెట్టుకున్నా పెద్దగా ఫలితం లేకపోయింది.. సుహాస్‌కి వరుసగా మూడో హిట్టు దక్కగా, బిగ్ బాస్ నుంచి వచ్చి హీరో వేషాలు వేస్తున్న సోహైల్‌కి వరుసగా మూడో ఫ్లాప్ పడింది..
Ambajipeta Marriage Band Review : బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుహాస్..