షుగర్.. ఓ మానసిక సమస్య..

Sugar Control Food : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ రోజుల్లో అధిక బరువు, వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ అవడం చాలామందిలో చూస్తూనే ఉన్నాం. మనం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం 80% మన చేతుల్లోనే ఉంటుంది.

ముత్యమంతా పసుపు.. ముఖమెంతో ఛాయా..

బరువు తగ్గడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలనుకునే వారు భోజనానికి ముందు పండ్లు తీసుకోండి..
* పండ్లు తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పీచు పదార్థాలు, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు అందుతాయి. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.
* భోజనానికి ముందు పండ్లు తీసుకోవడం వలన సగం కడుపు నిండి.. ఆహారం తక్కువగా తీసుకొంటారు.

Sugar Control Food

* ఆపిల్, జామ, ద్రాక్ష, బత్తాయి తొనలు అంటే.. తొక్కతో పాటు తినగలిగే పండ్లను, తొక్కతో పాటే తినాలి. ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఎక్కువ పీచుపదార్థం తొక్కల్లోనే ఉంటుంది.
* పండ్లు తినడం అలవాటు చేసుకొంటే.. వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు మన బరువు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
* పండ్లు తినే ముందు వాటిని ఒక 3 నిముషాలు ఉప్పు నీటిలో ఉంచి.. తర్వాత మంచి నీటిలో కడిగి తినాలి. ఎందుకంటే ఆపిల్ లాంటి పండ్లు ఎక్కువ నిల్వ ఉండడానికి కెమికల్ పూతలు పూస్తారు.

వాము అన్నం..

మానసిక సమస్యల కారణంగా ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలౌతాయి. ఈ హార్మోన్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ ని అమాంతం పెంచేస్తాయి. సో.. ఫ్రూట్స్ తినడం వల్ల మానసిక ప్రశాంతత కల్గుతుంది. తద్వారా షుగర్ ను కొంత వరకు కంట్రోల్ లో ఉంచే అవకాశం ఉంటుంది.

హెయిర్ ఫాల్ సమస్యకి సింపుల్ చిట్కా..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post