కొన్నేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో కోలీవుడ్లో జరిగే చీకటి బాగోతాలను బయటపెట్టింది సింగర్ సుచిత్ర. ఆమె విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు క్రియేట్ చేశాయి. ధనుష్, రజినీ కూతురు ఐశ్వర్య విడాకుల గురించి సంచలన ఆరోపణలు చేసింది సింగర్ సుచిత్ర…
‘ఐశ్వర్య, ధనుష్ తనను ఛీటింగ్ చేశాడని అంటోంది. అందుకే విడాకులు కావాలని అంటోంది. అయితే ఐశ్వర్యా పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా వేరేవాళ్లతో సంబంధం పెట్టుకుంది. ధనుష్, ఐశ్వర్యను ఛీట్ చేసినట్టే, ఐశ్వర్య కూడా ధనుష్‌ని ఛీట్ చేసింది..
ఐశ్వర్య, వేరే వ్యక్తితో బార్‌లో డ్రింక్స్ తాగుతూ డేట్‌లో ఉన్నట్టుగా పబ్లిక్‌గా ప్రకటించింది. పెళ్లైన తర్వాత వేరే వ్యక్తితో డేట్‌కి వెళ్తే, ఏం జరుగుతుంది? ఐశ్వర్య కంటే ధనుష్ చాలా బెటర్.. ధనుష్ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు, అలాగని ఎలాంటి ఇష్టం కూడా లేదు.. వాళ్ల పిల్లలు అటు ధనుష్ దగ్గర, ఇటు ఐశ్వర్య దగ్గర ఉండకూడదు.. తాత రజినీ దగ్గర పెరగాలి.. ’ అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు సింగర్ సుచిత్ర..
ఇంతకుముందు ధనుష్‌కి హీరోయిన్ త్రిషకి మధ్య వివాహేతర సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేస్తూ, ప్రైవేటు వీడియోలు కూడా లీక్ చేసింది సుచిత్ర..