Story about Humanism : మానవవాదం..

Special Story about Humanism and Humanity : మానవవాదం (Humanism) అంటే.. చాలామంది మానవత్వం (Humanity) అనుకుంటారు కానీ రెండింటికీ చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే అహ్మద్‌నగర్‌కి అహ్మదాబాద్‌కి ఉన్నా తేడా! మానవత్వం అంటే ఎవరికైనా జాలీ, కరుణ, ప్రేమ చూపిస్తాం.. ఇదే మనుషుల్లో ఆస్తికులు ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు. కానీ మానవవాదంలో చాలా నిర్వచనాలు ఉన్నాయ్ కానీ నాకు నచ్చిన నిర్వచనం ఏమిటి అంటే.. (ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ప్రకారం) మానవవాదం అనేది ప్రజాస్వామ్య మరియు నైతిక జీవన వైఖరి, ఇది మానవులకు వారి స్వంత జీవితాలకు అర్థం మరియు ఆకృతిని ఇవ్వడానికి హక్కు మరియు బాధ్యత ఉందని ధృవీకరిస్తుంది. ఇది మానవ సామర్థ్యాల ద్వారా హేతుబద్ధత మరియు స్వయం ఆలోచన స్ఫూర్తితో మానవ మరియు ఇతర సహజ విలువలపై ఆధారపడిన నైతికత ద్వారా మరింత మానవీయ సమాజాన్ని నిర్మించడం కోసం నిలుస్తుంది. ఇది ఆస్తికమైనది కాదు మరియు వాస్తవికత యొక్క అతీంద్రియ అభిప్రాయాలను అంగీకరించదు.

మానవవాదంలో 8 కీలక విషయాలు ఉంటాయి. ఎవరైన మానవవాదంలోకి అడుగులు వెయ్యాలి అంటే ఈ విషయాలు నీ పరిగణలోకి తీసుకోవాలి.

లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..

మొదటగా మానవవాదులు ఎక్కువగా Reason and science Theory ని Follow అవుతారు. ఉదాహరణకు సూర్యుడు తూర్పు నీ ఉదయించి, పశ్చిమ నా అస్తమిస్తాడు అంటారు. ఇది మనం చిన్నపట్నుంచి వింటున్నాం కానీ సూర్యుడు ఎక్కడ కి వెళ్ళాడు మన భూమి తిరగడం వల్ల, సూర్యుడు మారతాడు. ఈ కారణం వల్ల, బైబిల్ లో చెప్పినట్టు 7 రోజుల్లో భూమి అవతరించింది. ఖురాన్ లో ఉన్నట్టు 6 రోజుల్లో భూమి ఆవతరించింది. ఇంకా హిందూపురాణాల్లో అయితే ఒక కమలాన్ని బ్రహ్మ దేవుడు మూడు ముక్కలుగా చేస్తే, ఒక స్వర్గం, ఒక నరకం, ఒక భూమి ఏర్పడింది అని ఇలాంటి కథలు నమ్మరు. మాలాంటి మానవవాదులు థియరీస్ ని నమ్ముతారు. దాని బట్టి Question, Discuss ఇంకా ఆ విషయం గురించి చదువుతారు. దీన్నే English లో Rational Thinking అని అంటారు. నిజాలను బట్టి తప్ప ఎమోషన్స్ బట్టి ఎటువంటి ముగింపుకి రారు.

* మానవవాదులు ఎక్కువగా నాస్తికులు, ఆగ్నేయవాదులు మరియు ఏ మతంలోనూ లేని వాళ్లు ఉంటారు. వీళ్లకి స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, దేవదూతలు, రాక్షసులు, పునర్జన్మ, పూర్వజన్మ, పురాణాల్లో మరియు మఠంలోని పాత్రలు మరియు కథలు లాంటివి నమ్మరు.
* మానవులని మనుషులుగా చూస్తాం, మనుషుల్లో ఉన్న సోపానక్రమాలు మరియు విభజనలు చాలా ఉన్నాయి. మానవులు అందరు ఒక్కరే మరియు మానవులో ఎటువంటి విభేదాలు లేవు. నలుపు, తెలుపు, డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, గే, లెస్బియన్, ఆడ, మగ, ఎత్తువంటి విబేధాలు మనువాదంలో ఉండదు.

Story about Humanism

* మానవవాదం అంటే చాలావరకు Moral Autonomy మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దేవుడు వాక్యాలు, శ్లోకాలు వంటి వాటికీ తావుండదు. మనిషి ఒక పరపక్త్వత ఇంకా తన మనఃసాక్షిని బట్టి ఉంటుంది. మనిషికి తనకుతానుగా స్వాతంత్ర్య నిర్ణయం ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఎటువంటి హానికరమైన పనులు.. చంపడం, దూషించడం లాంటివి మానవవాదులు చేయరు.

* జీవిత అర్ధం.. ఎక్కువ మంది మఠం పెద్దలు ఇంకా ఆధ్యాత్మిక గురువులు అనే మాట, ఈ మఠంని ఫాలో అయితే మీకు మీ జీవితం ఇంకా దాని పరమార్ధం అనేది అర్ధం అవుతుంది. కానీ ఇక్కడి మనుషులు, తాను నమ్మిన సిద్దాంతం ప్రేమలో మునిగిపోతాడు. తను ఏం చేయలయనుకుంటాడో అదే జీవితార్థం. ఇక్కడ ఈ మాట, దేవుడు ఇంకా ఆ గ్రంధం ప్రస్తావన ఉండడు.

మానవవాది మార్క్స్..

* Morality కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటది, జీవితంలో దేవుడు ఉంటేనే బాగుంటాము. దేవుడు ఇంకా మతం చెప్పకపోతే మనం ఎటువంటి దారుణాలైనా చేయోచ్చు అనేది కాదు, మనం అడవిలో ఉన్నపుడు ఈ మతం ఇంకా జాతి లేనప్పుడు, మనలో దయతత్వం, కరుణ, ప్రేమ, ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇది మనిషిలో ఉండే సహజ లక్షణం. దానివల్ల మనము మనమే గైడ్ చేస్కోగలము మంచిగా ఉండే దానికి, ఈ దేవుడు ఇంకా తన గ్రంథం అవసరం లేదు. మతంలో ఉన్న కొందరి ఆధిపత్యం, డొల్లతనానికి ఇంకా వెనుకబాటు తనానికి ప్రశ్నిస్తాం.
* మానవవాదులు నమ్మేది ఒకే ఒక జీవితం, పాపం చేస్తే కుక్కలాగ పుడుతాం లేకపోతే నరకానికి పోతాం, ఇంకా పుణ్యం చేస్తే వచ్చే జన్మ ఉండదు, లేకపోతే స్వర్గంలో ఉంటావు అనే నమ్మకాలు ఉండవు. మాకు ఉన్నది ఒక్కటే జీవితం.. ఈ జీవితంలో మనమేం చేయాలి అనుకున్నామో అది చేయాలి.
* చివరగా మానవవాదులందరూ లౌకికవాదులు, వీళ్లకి స్వేచ్ఛగా ఉన్న సామ్యవాద ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తారు.

భారతదేశం మరియు మానవవాదం : మానవవాదం అనేది ప్రాచీనమైన గ్రీక్ ఫిలాసఫీ మరియు చైనీస్, కన్ఫ్యూషియస్ కంటే ముందే మన భారత్ లో దీని ప్రస్తావన ఉండేది. 6వ శతాబ్దం BCE లో, చరవాకులు మొదటగా దీన్ని ప్రారంభించారు. వాళ్ళు వేదాలు ఇంకా దేవుడి ఉనికిని ప్రశ్నించారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరించారు, భౌతికవాదం (Materialism) ని ప్రోత్సహించింది. ఈ సృష్టిలో ఏమీలేదు. అంతా Matter and Movements ని బట్టి ఈ ప్రపంచం ఉంది. మతం అనేది మనిషి యొక్క సృష్టి. మనందరం ఈ జీవితంలో సంతోషంగా ఇంకా సుఖంగా బతకాలి. బౌద్ధమతం కూడా.. ఇది మొదటి మతం నాస్తికవాదాన్ని ప్రమోట్ చేసింది. కానీ ఇప్పుడు మూడు భాగాలుగా విడిపోయి.. Mahayana, Theravada and Tibetan దాని ఒక మూలం ని పోగొట్టుకుంది. బుద్ధుడి యొక్క గొప్పతనం ఏమిటంటే.. దేవుడు లేకుండా మనమెలా మంచి మనిషిగా బతకాలి, జీవితం అంటే ఏంటీ అని బుద్ధుడు శోధించారు. కులం, ఇంకా పుట్టుక లేకపోతే గ్రంథాల మీద పట్టు ఉండడం ఇవి బౌద్ధంలో ముఖ్యం కాదు.

క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..

బుద్ధుడు తాను ఒక గురువు అని చెప్పరు తప్పా, తను దేవుడు లేకపోతే దేవుడు బిడ్డ, ఇంకా దేవుడు ప్రవక్తగా తాను చెప్పలేదు. Dr BR అంబేద్కర్ గారు.. మహారాష్ట్ర 1935లో కాన్ఫరెన్స్ లో తను హిందూమతం వదిలేస్తాను అని చెప్పారు, చెప్పినట్టూ 1956లో బౌద్ధంలో చేరారు. అనంతరం “నేను బుద్ధుడుని ఒక మార్గదర్శిగా చూస్తున్నాను కానీ దేవుడిగా కాదు” అని విలేకరులతో అన్నారు. బుద్ధుడు నేర్పించింది కరుణ, స్వేచ్ఛ, ఆలోచన, మానవత్వం, మరియు సమానత్వం అందుకే బౌద్ధం అనేది Humanism కి దగ్గరగా ఉంటుంది. కానీ బౌద్ధం తర్వాత రోజుల్లో హిందూ రాజులు ఇంకా హిందూ మత గురువుల వల్ల Buddhism నాశనం అయ్యింది. 1956 వరకు రివైవల్ అవ్వలేదు.

Story about Humanism

ప్రపంచంలో చరవాకులు సమయంలోనే గ్రీస్ లో Aristotle, Plato, Protagoras, Thales మరియు Anaximander చాలా వరకు ప్రస్తుతం ఉన్నా మనువాదాన్ని ప్రచురణలోకి తీసుకొచ్చారు. నాకు ఇష్టమైన ఫిలాసఫీ Epicurus ది , ఆ philosophy ఏం చెప్తుంది అంటే.. మనిషి యొక్క ముఖ్య ధ్యేయం సంతోషంగా ఉండడం.
తర్వాత, దీని నిర్మాణం యూరప్‌లో 14వ శతాబ్దం తర్వాత ప్రారంభమైంది. దానికి ముందు చర్చి అధికారులు, మహారాజులు, నైట్లు ఇంకా పాస్టర్లు చాలామంది మానవవాదులను, ప్రశ్నించేవాళ్ళను, శాస్త్రవేత్తలని చంపేశారు. దాన్నే ఇంగ్లీష్ లో Dark Ages అని అంటారు. తర్వాత Renaissance (14th century) మళ్లీ Enlightenment (17th century) లో మానవవాదం విస్తృతమైంది.

మన ఇండియాలో బ్రిటీష్ రాక తరువాత మానవవాదాన్నీ మరియు నాస్తికత్వాన్ని BR అంబేద్కర్, భగత్ సింగ్ ఇంకా దక్షిణ భారతంలో పెరియార్ రామసామి ప్రమోట్ చేసారు. ఇప్పుడు నాస్తికుల సంఖ్య మరియు మానవులు సంఖ్య ప్రపంచంలో పెరుగుతోంది. 2023 మతం జనభా ప్రకారం.. ఇంచుమించు 1.19 బిలియన్ మంది Unaffiliatedగా ఉన్నారు. ఇది ప్రపంచంలో మూడవ అతి పెద్ద SECTION IN RELIGIONS (నాస్తికులు, ఆగ్నేవాదులు, మతంలేని వాళ్ళు) దీన్ని మానవత్వం పెరిగే సూచికగా అనుకోవచ్చు.

నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ షాకింగ్ కామెంట్స్..

మానవవాదం కల్ట్ :
Europe లో Churches, ఇప్పుడు ఉన్న Humanism (మానవవాదం movement)ని కల్ట్ ఉద్యమం అంటారు. కానీ కల్ట్ కి ఉన్నా డెఫినిషన్ ఏంటి అంటే.. ఒక చిన్న గ్రూప్ ని ఒక లీడర్ శాసిస్తూ.. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని.. ఆ గ్రూప్ ఆ నాయకుడు ఇచ్చిన సూచనలను బట్టి ఈ గ్రూప్ నడుచుకుంటుంది. కానీ మానవవాదంలో ఎక్కడ లీడర్ కానీ ఫౌండర్ కానీ ఉండదు. మానవవాదం అనేది మనిషి యొక్క స్వేచ్ఛ మరియు ఆలోచన తప్పా ఇంకొక మనిషి Influence ని బట్టి ఉండదు. ఒక టీచర్ లాగా, వాళ్ళు రాసే ఆర్టికల్స్ అండ్ చెప్పే విషయాలు నచ్చితే ఆ ఫిలాసఫీ ఫాలో అవుతారు తప్పా ఆ టీచర్ (Person) ని బట్టి కాదు.

దేవుడిని నమ్మని వాళ్ళ కంటే.. దేవుడిని నమ్మే వాళ్లే ఎక్కువగా Cults లో జాయిన్ అవుతారు. వేరే వాళ్ళని లేదా వాళ్లంతట వాళ్ళు కూడా దహనం చేసుకుంటారు. మానవవాదం అనేది CULT కి వ్యతిరేకం మరియు ఎటువంటి Cultism ని ప్రమోట్ చేయదు. ఇది ఒక పీపుల్ డెమోక్రసీ లాగా.. ప్రతి మనిషికి ప్రాముఖ్యత ఉంది, ఎవరూ ఎవరి కిందా ఉండక్కర్లేదు.
నేను ఉన్న గ్రూప్ లో.. నేను లెఫ్ట్ ఫిలాసఫీని నమ్మేవాడిని. కానీ కొద్దిమంది మిత్రులు సెంటర్ వింగ్ లేకపోతే ఎటువంటి పొలిటికల్ గ్రూప్ ఇంకా ఫిలాసఫీతో సంబంధం లేకుండా ఉన్నారు. కానీ మాకు ఉన్న కామన్ పాయింట్ ఏంటీ అంటే.. HUMANISM.

రిపబ్లిక్‌ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చేది కష్టమే..!

Conclusion :
ఇప్పుడు ఉన్న 21వ శతాబ్దంలో మనం చాలా సంతోషంగా ఉన్నాం. సైన్స్‌లో మనం చాలా సాధిస్తున్నాం. అరిటిఫికల్ ఇంటెలిజెన్స్ (AI), వైఫై, డిజిటల్ లావాదేవీలు, డ్రైవర్‌లెస్ కార్లు, చంద్రయాన్ 3 ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కప్పుల పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయి, నరబలి పూజలు, ఆఫ్రికాలో ఎవరైనా మంత్రికలు అంటే.. సజీవ దహనం చేయడం, యూరప్ లో దయ్యాల పూజలు లాంటివెన్నో.. Whatsapp లో హనుమంతుడు గాధ అంటే.. అది నిజం అని 10 మందికీ షేర్ చేస్తాం.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ సమాజానికి మానవవాదం చాలా అవసరం. మానవవాదం అనేది ఒక ఈజీ వే.. దీంట్లోకి Convert అవ్వాల్సిన అవసరం లేదు, పూజారి అవసరం లేదు. ఇంకా ఎలాంటి పద్ధతి లేదు. మీలో మీకు ఒక Enlightment.. మీరు ఆనందంగా ఉండాలి అంటే.. మానవవాదం వైపు అడుగులు వేయండి.

Note : ఈ వ్యాసం.. నాకు రైటర్ గా గుర్తింపు ఇచ్చిన Babu Gogineni Humanists and Rationalist Group, Babu Gogineni గారికి And Writer గా అవకాశం ఇచ్చిన మా Humanistically Speaking Magazine Editor David Warden గారికి మరియు ఇంకా నా మిత్రులకు అంకితం..

By KS Raha

Related Post