Srimanthudu Controversy : అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీ, ఇప్పుడు కొరటాల శివను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన శ్రీమంతుడు మూవీ, అప్పట్లో దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. అప్పటిదాకా ఉన్న నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?
అయితే ఈ మూవీ కథను కొరటాల శివ, తాను రాసిన నవల నుంచి దొంగిలించాడని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కాడు. 9 ఏళ్ల విచారణ తర్వాత కొరటాల శివ నిజంగానే కాపీ చేసినట్టుగా న్యాయస్థానం తేల్చింది. ‘నాకు వాళ్లు కేసు వెనక్కి తీసుకోవాలని రూ.15 లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే నాకు డబ్బులు ముఖ్యం కాదు. నేను రాసిన కథను, తాను రాసిన కథగా ఎలా వేసుకుంటాడు. అది నా కథ.. నాకు క్రెడిట్ ఇవ్వాలి. అలాగే కొరటాల శివ చేసిన తప్పును ఒప్పుకోవాలి. అలాగే మహేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ మీద కూడా సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నా..
ఇంతకుముందు నేను మహేష్‌కి నోటీసులు పంపించాను. అయితే ఈ కేసు నుంచి మహేష్‌ని తప్పించేందుకు నమ్రతా తెలివిగా, ఎంబీ క్రియేషన్స్ యజమానిగా మహేష్ పేరు తప్పించి, గంగాధర్ పేరు పెట్టింది.. జరిగిన దాంట్లో వాళ్లకి కూడా భాగం ఉంది..’ అంటూ కామెంట్లు చేశాడు రచయిత శరత్ చంద్ర.. అయితే నాంపల్లి హైకోర్టు, నాలుగేళ్ల క్రితమే ఈ కేసు నుంచి మహేష్, మైత్రీ మూవీ మేకర్స్ తప్పిస్తూ, వారికి కథ కాపీ విషయంలో సంబంధం లేదని తీర్పు వెలువరించింది.
Srimanthudu Controversy : కొరటాలను వెంటాడుతున్న ‘శ్రీమంతుడు’ కాంట్రవర్సీ..