శ్రీకాంత్ సినిమాకి కలిసి వస్తున్న ‘ఆదికేశవ’రిజల్ట్.. ‘కోటబొమ్మాళి పీఎస్’కి పెరుగుతున్న కలెక్షన్లు..

Balayya - Radhika Apte

Srikanth’s Kota Bommali movie : వరల్డ్ కప్ వీక్ తర్వాత నవంబర్ 24న పంజా వైష్ణవ్‌ తేజ్ ‘ఆదికేశవ్’తో పాటు శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి పీఎస్’, బిగ్‌బాస్ సన్నీ ‘సౌండ్ పార్టీ’ మూవీస్ కూడా విడుదలయ్యాయి. అయితే క్రేజీ హీరోయిన్ శ్రీలీల కారణంగా ‘ఆదికేశవ్’ మూవీకి ఎక్కువ థియేటర్లు దక్కి, మొదటి రోజు మంచి వసూళ్లు కూడా వచ్చాయి.

‘ఆదికేశవ’ రిజల్ట్‌తో శ్రీలీల స్పీడ్‌కి బ్రేకులు, మరో కృతి శెట్టి కాదుగా..

అయితే మొదటి రోజే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రాగా, సన్నీ చేసిన ‘సౌండ్ పార్టీ’ సౌండ్ లేకుండానే వెళ్లిపోయింది. అసలు ఈ మూవీ రిలీజ్ అయిన విషయమే చాలామందికి తెలీదు. టాక్ కూడా నెగిటివ్‌గా ఉండడంతో సన్నీకి సక్సెస్ దక్కనట్టే. శ్రీకాంత్‌తో పాటు రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’కి మంచి టాక్ వచ్చింది.

‘సూర్యకాంతం’, ‘పంచతంత్రం’ వంటి సినిమాల్లో నటించిన రాహుల్ విజయ్, ఇందులో పోషించిన పాత్రతో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. జీవిత, రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటించింది. 2019లో అడవి శేషుతో కలిసి ‘టూ స్టేట్స్’ మూవీ రిమేక్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది శివానీ. అయితే ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తేజ సజ్జతో కలిసి ‘అద్భుతం’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. పేరుకి తగ్గట్టే ఆ మూవీకి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. అయితే నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో శివానికి పెద్దగా పేరు రాలేదు.

Srikanth's Kota Bommali movie

‘కోట బొమ్మాళి’ మూవీ, 2021లో మలయాళంలో వచ్చిన ‘నయట్టు’ అనే సినిమాకి రిమేక్. కోట బొమ్మాళి అనే ఊరిలో పనిచేసే పోలీసులుగా శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ నటించారు. వీరిపై ఓ కేసు నమోదవుతుంది. ఆ కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు వీళ్లు చేసిన ప్రయత్నాలు ఏంటి? నిజంగా ఆ తప్పు చేసింది ఎవరు? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్..

బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీకాంత్, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ మూవీలోనే తనకు సరైన క్యారెక్టర్‌లో నటించాడని అనిపిస్తుంది. శివాని మంచి నటిగా నిరూపించుకుంది. మలయాళ చిత్రాన్ని చెడగొట్టకుండా, కాస్త తెలుగు నెటివిటీని జోడిస్తూ దర్శకుడు తేజ మర్ని బాగానే సక్సెస్ అయ్యాడు.

‘జోహార్’ అనే ఓటీటీ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన తేజ మర్ని, ‘అర్జున పల్గుణ’ మూవీతో కమర్షియల్ మూవీ చేసే ప్రయత్నం చేశాడు. ‘జోహార్’లో ఉన్నట్టుగానే ‘కోట బొమ్మాళి పీఎస్’లోనూ ఆలోచనలకు పదును పెట్టే డైలాగ్స్ రాసుకున్నాడు తేజ. ఈ మూవీలో ‘లింగిడి లింగిడి’ పాట సూపర్ హిట్టైంది. ఆ పాట కారణంగానే ఈ మూవీకి కాస్తో కూస్తో ప్రచారం జరుగుతుంది. ‘ఆదికేశవ’ మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో ‘కోటబొమ్మాళి పీఎస్’కి కలెక్షన్లు పెరుగుతున్నా, ప్రమోషన్స్ కూడా పెంచితే మంచి హిట్టు కొట్టొచ్చు.

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post