Sreeranga Neethulu Review : సుహాస్ హీరోగా చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సుహాస్‌తో పాటు ‘బేబీ’ విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ, ఏప్రిల్ 11న విడుదలైంది..
టీవీ మెకానిక్‌గా పనిచేసే సుహాస్, సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే కాలనీలో ఉండే విరాజ్, రుహాని ప్రేమలో ఉంటారు. వీరి ప్రేమ కారణంగా రుహాని గర్భవతి అని తెలుస్తుంది. అక్కడే ఉండే కార్తీక్ రత్నం డ్రగ్స్‌కి బానిసై, దాని నుంచి బయటపడలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. డబ్బు బాగా అవసరమైన ఈ ముగ్గురి జీవితాలకు సంబంధించిన కథే ‘శ్రీరంగ నీతులు’..
Geethanjali Malli Vachhindhi Review : నో కామెడీ, నో హార్రర్..
సుహాస్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం అద్భుతమైన నటులు. ఈ సినిమాలో మరోసారి తమ యాక్టింగ్ టాలెంట్‌ని చూపించేశారు ఈ ముగ్గురూ. విరాజ్‌తో పాటు శ్రీనివాస్ అవసరాల ఓ గెస్ట్ రోల్లో నటించి మెప్పించాడు. ఇలాంటి సినిమాల నుంచి భిన్నమైన కథాంశాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. అందులో ఇందులో దర్శకుడు ఓ సీరియస్ పాయింట్‌ని తీసుకున్నట్టుగా అనిపించదు..
స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సింది. ఫస్టాఫ్ సోసోగా సాగినా, ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం మొదలవుతుంది. పాటలు పెద్దగా మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. మొత్తానికి పెద్దగా పబ్లిసిటీ లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీలో మంచి నటీనటులు ఉన్నా, బలమైన కథ, కథనాలు లేకపోవడంతో బిలో యావరేజ్ బొమ్మకి కాస్త తక్కువగా మిగిలింది..