‘ఆదికేశవ’ రిజల్ట్‌తో శ్రీలీల స్పీడ్‌కి బ్రేకులు, మరో కృతి శెట్టి కాదుగా..

Sreeleela

Sreeleela : క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలి. అయితే సరిగ్గా వాడుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ‘కుమారి 21F’ మూవీ తర్వాత హెబ్బా పాటిల్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అయితే వచ్చిన సినిమాలను వచ్చినట్టు ఓకే చేసుకుంటూ పోయిన హెబ్బా, తక్కువ కాలంలోనే కనిపించకుండా పోయింది. ‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టి కెరీర్ కూడా ఇలాగే సాగుతోంది.

వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రివ్యూ : వీడెవడో మరో బోయపాటిలా ఉన్నాడే..

ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే ప్రమాదంలో పడినట్టు కనిపిస్తోంది. రోషన్‌తో ‘పెళ్లి సందడి’, రవితేజతో‘ధమాకా’ తర్వాత శ్రీలీల, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. మహేష్, పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ వంటి క్రేజీ స్టార్ కూడా శ్రీలీల డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.

అయితే ‘ధమాకా’ తర్వాత శ్రీలీల చేసిన ‘స్కంధ’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్. ఈ మూవీలో శ్రీలీల యాక్టింగ్ కూడా సోసోగానే అనిపించింది. గ్లామర్‌తోనూ మెప్పించలేకపోయింది. సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోయిన్లు అందంగా కనిపిస్తారు. కానీ ‘స్కంధ’, శ్రీలీలకు పెద్దగా ప్లస్ కాలేదు.

Sreeleela

ఆ తర్వాత బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ మూవీ చేసింది శ్రీలీల. ఇందులో బాలయ్యకి అన్న కూతురిగా నటించింది. నటన పరంగా ఫుల్లు మార్కులు కొట్టేసినా, ఈ మూవీ సక్సెస్, శ్రీలీల కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడదు. తాజాగా వైష్ణవ్ తేజ్‌తో చేసిన ‘ఆదికేశవ’ మూవీ కూడా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో శ్రీలీల డ్యాన్సులే హైలైట్‌గా నిలిచినా, వాటితోనే సినిమాని లాక్కొచ్చే కంటెంట్ మూవీలో లేదు.

అక్కినేని ఫ్యామిలీ ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా..!?

గత మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్లు ఫేస్ చేసింది శ్రీలీల. డిసెంబర్‌లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీతో వస్తున్న శ్రీలీల, జనవరితో ‘గుంటూర్ కారం’మూవీపైన చాలా ఆశలే పెట్టుకుంది. ‘ఎక్స్‌ట్రా’ కాస్త తేడా కొట్టినా మహేష్ మూవీతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోవాలని అనుకుంటోంది. పవన్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేస్తున్నా, అది ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి.

ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది శ్రీలీల. అయితే కాల్షీట్స్, పరీక్షల కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. శ్రీలీల ఇప్పటికైనా సబ్జెక్ట్ విషయంలో జాగ్రత్త పడకపోతే, కృతి శెట్టిలా ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది.

Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post