సినిమాల కోసం MBBS Examsకి డుమ్మా కొట్టిన శ్రీలీల.. సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలంటూ..

Sreeleela : చేసింది కొన్ని సినిమాలు అయినా, తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల. ప్రస్తుతం మహేష్‌తో ‘గుంటూర్ కారం’, పవన్ కళ్యాణ్‌తో ‘సర్ధార్ భగత్ సింగ్’ సినిమాలు చేస్తున్న శ్రీలీల, గత ఏడాది ఎంబీబీఎస్ ఎంట్రెస్ టెస్టు క్లియర్ చేసింది. ‘ధమాకా’ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో డాక్టర్ చదువు పూర్తి చేయాలనుకున్న శ్రీలీల, కెరీర్‌పై ఎటూ తేల్చుకోలేక పోతుందట..

మహేష్‌ బాబు – సౌందర్య కాంబోలో మూవీ.. మధ్యలో కథ అడ్డం తిరిగి..

విజయ్‌ దేవరకొండతో ఓ మూవీ కమిట్ అయ్యింది శ్రీలీల. అయితే సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుని, ఎంబీబీఎస్ పరీక్షలు రాయాలని డిసైడ్ కావడంతో ఆ మూవీ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ‘ఖుషీ’ తర్వాత విజయ్ చేయాల్సిన సినిమా ఇదే. అయితే శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్’ ముందుగా మొదలైంది..

Sreeleela

అయితే తాజాగా శ్రీలీల, సినిమా షూటింగ్, ప్రమోషన్స్ కారణంగా ఎంబీబీఎస్ పరీక్షలు రాయలేకపోయిందట. మహేష్‌తో అప్పుడెప్పుడో మొదలైన ‘గుంటూర్ కారం’ అనేక కారణాల వాయిదా పడుతూ, 2023 జనవరి దాకా వచ్చింది. ఈ షూటింగ్ వాయిదా పడడం వల్ల పరీక్షల కోసం శ్రీలీల పెట్టుకున్న టైమ్ అంతా వృథా అయిపోయిందట.

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

ఎగ్జామ్స్ రాయాల్సిన సమయంలో అటు ‘గుంటూర్ కారం’ షూటింగ్‌లో పాల్గొంటూ, మరోపక్క ‘ఆదికేశవ’ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో బిజీగా గడిపిందట శ్రీలీల. దీంతో పాప డాక్టర్ కావాలంటే సప్లి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి. ‘ప్రేమమ్’ మూవీ తర్వాత సాయి పల్లవికి కూడా కోలీవుడ్, టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వచ్చాయి. అయితే డాక్టర్ చదువు పూర్తి చేయాలని ఫిక్స్ అయిన సాయి పల్లవి, దానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. చదువు పూర్తి అయ్యాక సినిమాలు ఒప్పుకుంది. శ్రీలీల కూడా సాయి పల్లవిని ఫాలో అయితే బెటరేమో అంటున్నారు కొందరు నెటిజన్లు..

‘ఆదికేశవ’ రిజల్ట్‌తో శ్రీలీల స్పీడ్‌కి బ్రేకులు, మరో కృతి శెట్టి కాదుగా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post