Sreeja First Husband: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఆకస్మికంగా మృతి చెందాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్, ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత మరో వివాహం చేసుకున్నాడు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, 2007లో శిరీష్‌ని పెళ్లి చేసుకుంది. 19 ఏళ్ల వయసులో శ్రీజ, 22 ఏళ్ల శిరీష్‌తో లేచిపోయి, ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడం పెద్ద దుమారమే రేపింది. పెళ్లికి ముందు నాలుగేళ్ల నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇంట్లో చెప్పినా ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ హాఠాత్ సంఘటనతో చిరంజీవి ఫ్యామిలీ షాక్ అయ్యింది..
Mega Family vs Allu Family: అల్లు అర్జున్- సాయిధరమ్ తేజ్ ఇష్యూపై నిహారిక కామెంట్..
పెళ్లి తర్వాత శ్రీజ, శిరీష్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లిపోయి, మీడియా ముందుకు వచ్చారు. ఈ సంఘటనపై చిరూ స్పందించలేదు. తన కూతురు ఎక్కడున్నా సంతోషం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పి, మీడియాకి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల కాపురం తర్వాత శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని అతనితో విడాకులు తీసుకుంది శ్రీజ..