Sr NTR : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..

Sr NTR Vardhanthi
Sr NTR Vardhanthi

Sr NTR : ఎక్కడ పుట్టామనేది కాకుండా, ఎలా బతికామనేది మాత్రమే ఈ లోకం గుర్తుంచుకుంటుంది. అందుకే ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లోని నిమ్మకూరులో జన్మించిన ఎన్టీ రామారావు, 7 కోట్ల మందికి ఆరాధ్య దైవం అవుతాడని ఎవ్వరు మాత్రం ఊహించి ఉంటారు. నటుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీ రామారావు, రాముడిగా, శ్రీకృష్ణుడిగా, మహా శివుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా, యమ ధర్మరాజుగా, రావణాసురుడిగా… పౌరాణిక పాత్రల్లో నటించి.. రాముడంటే ఇలాగే ఉంటాడేమో, అనేంతలా తెలుగువారికి చేరువయ్యాడు.

Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

పార్టీ పెట్టిన 7 నెలల్లోనే ముఖ్యమంత్రిగా గెలిచిన రామారావు, రాజకీయ ప్రస్థానం నా భూతో, నః భవిష్యత్.. రూపాయికే కిలో బియ్యం, రేషన్ కార్డులు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో రాజకీయాల్లో సూపర్ సక్సెస్ సాధించిన ఎన్టీ రామారావు, మరణం ముందు మాత్రం అనేక రకాల అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ముఖ్యంగా లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ రెండో పెళ్లి, ఆయన ఇమేజ్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. అనారోగ్య సమస్యలకు తోడు, భార్య దూరమైన ఎన్టీ రామారావు.. లక్ష్మీ పార్వతి చేతుల్లో కీలుబొమ్మలా మారాడు. ఇదే అదునుగా భావించి, పార్టీ భవిష్యత్తు కోసం పగ్గాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు… ఇక్కడ జరిగింది వెన్నుపోటా? లేక అపద్ధర్మమా? అనేది ఎవ్వరూ స్పష్టంగా సమాధానం చెప్పలేని ప్రశ్నే..

లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే, ‘వీరభోగ వసంతరాయలు’ పుడతాడని ఎన్టీఆర్‌కి చెప్పిన జ్యోతిష్యుడు..

ఓ స్థాయి దాటిన తర్వాత తనపై జనాలు చూపిస్తున్న అభిమానం, ప్రేమానురాగాలు చూసి… తాను కారణజన్ముడినే అని ఎన్టీ రామారావు ఫీలయ్యాడు. అందుకే తన దగ్గర తలదించుకుని, ‘దేవుడా..’ అని పిలిచినవారిని ఆదరించాడు. ఆయన వీక్‌నెస్ అర్థం చేసుకున్న కొందరు అభిమానులు.. లాభం పొందారు.. ఎన్టీఆర్ ఇమేజ్‌పై మచ్చపడేలా చేశారు.

చిరంజీవి కూడా ప్రజారాజ్యం సమయంలో దాదాపు ఎన్టీఆర్‌ ఉన్న భ్రమల్లోనే ఉన్నాడు. బామ్మర్ధి అల్లు అరవింద్ ఏం చెబితే అది నమ్మి, 7 నెలల్లో అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతో పార్టీ పెట్టారు. అయితే ఎన్టీఆర్ టైమ్‌కి, చిరూ టైమ్‌కి జనాల్లో మార్పు వచ్చింది. తెర మీద నటుడు, తెర బయట దేవుళ్లు కాదని తెలుసుకున్నారు. అందుకే చిరూకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవం చూసిన మెగాస్టార్, రాజకీయాల్లో రాజీ పడలేక బయటికి వచ్చేశారు.

Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post