Sr NTR Krishna : పైకి కనిపించిన రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది. అందులో జరిగే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఉత్సుకత ఉంటుంది. సోషల్ మీడియా యుగంలో ప్రతీ చిన్న విషయం వైరల్ అవుతోంది. అయితే కనీసం ప్రతీ ఇంట్లో టీవీలు కూడా లేని రోజుల్లో నటరత్న ఎన్టీఆర్- నటశేఖర కృష్ణ మధ్య జరిగిన గొడవల గురించి చర్చ జరిగింది.. అసలు ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్ల మధ్య విభేదాలు నిజమేనా?
క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..
ఎన్టీఆర్‌ని చూసి సినిమాల్లోకి వచ్చిన కుర్రాళ్లలో బుర్రిపాలెం బుల్లోడు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి కూడా ఒకడు. కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్, కృష్ణకు తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు కూడా. అయితే కాలక్రమేణా కృష్ణ కూడా మాస్ హీరోగా మారి, తెలుగునాట స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు.
అప్పటికే ఇండస్ట్రీని 20 ఏళ్లుగా ఏలుతున్న ఎన్టీఆర్, ఎఎన్నాఆర్‌లకు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీ మోహన్ వంటి నటులు పోటీ ఇవ్వడం మొదలెట్టారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్, కృష్ణ మధ్య రెండు సినిమాల వల్ల వైరం ఏర్పడింది.
వరుస ఫ్లాపులతో ఎన్టీఆర్ సతమతమవుతున్న సమయంలో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా ఆరంభించేలోపే, కృష్ణ, ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించాడు. అనుకున్నట్టే ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా, ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
ఈ సినిమాతో కృష్ణ స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకుడిగా, నిర్మాతగా, త్రిపాత్రాభినయం చేస్తూ నిర్మించిన సినిమా ‘దాన వీర శూర కర్ణ’. ఈ సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే కృష్ణ అర్జునుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా, శోభన్ బాబు కృష్ణుడిగా నటిస్తూ ‘కురుక్షేత్రం’ సినిమా రూపొందింది.
అప్పటికి ‘కురుక్షేత్రం’ టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమా. ‘దాన వీర శూర కర్ణ’, ‘కురుక్షేత్రం’ రెండూ 1977 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్, ‘దానవీర శూర కర్ణ’ ఇండస్ట్రీ హిట్ కొడితే, ‘కురుక్షేత్రం’ యావరేజ్‌గా నిలిచింది.
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?
ఈ రెండు సినిమాలతో మొదలైన వైరం, రాజకీయాల్లోనూ కొనసాగింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఆయనపై ‘మండలాదీశుడు’ పేరుతో ఓ సెటైరికల్ సినిమా తీశాడు. ఎన్టీఆర్ సక్సెస్ చూసి, కృష్ణ తట్టుకోలేకనే ఆయన ఇలాంటి సినిమాలు తీశారని అభిమానుల వాదన. నటుడిగా ఎన్టీఆర్‌ని ఆరాధించిన కృష్ణ, రాజకీయ నాయకుడిగా మాత్రం ఆయనను ఇష్టపడలేదనేది అందరికీ తెలిసిన విషయమే..