Sr NTR – Dr Rajkumar : ఎన్టీఆర్-ఎంజీఆర్- డాక్టర్ రాజ్‌కుమార్.. తొలి తరంలో సౌత్ సినిమాని ఏలిన దిగ్గజాలు. ఎన్టీఆర్ (Sr NTR).. తెలుగు సినీ పరిశ్రమని ఏలితే, ఎంజీఆర్ (MGR).. కోలీవుడ్‌లో కింగ్. కన్నడ చిత్ర పరిశ్రమలో డాక్టర్ రాజ్‌కుమార్ (Dr Rajkumar)కి తిరుగే లేదు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ఎన్టీ రామారావు, తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించారు. అయితే కన్నడ సినిమాల్లో మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడూ కనిపించలేదు.
ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..
అలాగే ‘కన్నడ కంఠీరవుడు’గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్, 220కి పైగా సినిమాలు చేశాడు. అయితే రాజ్‌కుమార్ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. కన్నడలో ‘బేడర కన్నప్ప’ పేరుతో తెరకెక్కించిన ‘భక్త కన్నప్ప’ సినిమాని తెలుగులో ‘కాళహస్తీ మహత్యం’ పేరుతో తిరిగి తెరకెక్కించారు. 1954లో విడుదలైన ఈ సినిమా, తెలుగులో 100 రోజులు ఆడింది. అయితే రాజ్‌కుమార్ తన సినీ కెరీర్‌లో చేసిన ఒకే ఒక్క కన్నడేతర సినిమాగా మిగిలిపోయంది.
రాజ్‌కుమార్, వేరే భాషా సినిమాలు ఎందుకు చేయలేదు? ఎన్టీఆర్, కన్నడలో సినిమాలు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నకు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాజ్‌కుమార్, కన్నడ నాట సూపర్ స్టార్‌గా వెలుగొందిన తర్వాత తనకు పోటీగా ఎవరొచ్చినా సహించేవారు కాదట. కొందరు కన్నడ హీరోలు, స్టార్లుగా వెలుగొందుతున్న సమయంలోనే అకాల మరణం చెందడానికి కూడా రాజ్‌కుమారే కారణమని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
కర్ణాటకలో జన్మించిన రజినీ, కన్నడ చిత్ర పరిశ్రమలో కాకుండా తమిళ్‌లో సెటిల్ అవ్వడానికి కూడా రాజ్‌కుమారే కారణమని అంటారు. కన్నడలో అనువాద చిత్రాలు విడుదల చేయకూడదని రూల్ తీసుకొచ్చింది కూడా రాజ్‌కుమారే. అలా రాజ్‌కుమార్, టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్‌తో ఓ సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నాడని అంటారు.
ఈ అగ్రిమెంట్ ప్రకారం తాను తెలుగులో సినిమాలు చేయనని, రామారావు గారు కన్నడలో సినిమాలు చేయకూడదని సంధి జరిగిందని చెబుతారు. అయితే దీని గురించి సరైన సమాచారం అయితే లేదు. ఎన్నో ఏళ్లుగా రాజ్‌కుమార్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. రామారావు మనవడు చిన్న ఎన్టీఆర్ (Jr NTR), పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) సినిమాలో పాట కూడా పాడాడు.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత చివరి చూపులకు వెళ్లిన బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజ్‌కుమార్ పెద్ద కొడుకు శివ రాజ్‌కుమార్, బాలయ్య నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించాడు. రెండు కుటుంబాల మధ్య ఇంత మంచి సంబంధాలు ఉండి, రాజ్‌కుమార్- ఎన్టీఆర్ మధ్య స్నేహమే కారణం.