Soundarya Birthday Special : సౌమ్య.. ఈ పేరు వింటే మీ పక్కింటి అమ్మాయి లేదా మీ ఇంట్లో వాళ్ళో గుర్తు వస్తారు. అందరి ఇంట్లో నవ్వులు, మనసూ నిండిపోయే హాయి, అలిగినప్పుడు పెట్టే బుంగ మూతి, కోపంలో చిలక ముక్కు, ఇవన్నీ కలకలిస్తే ‘ఆమె’. ఆమె.. మరెవరో కాదు సహజ నటి “సౌందర్య“. తన అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి వచ్చాక సౌందర్య అయ్యింది. ఇప్పుడు ఉన్న గ్లామర్ కీ, అప్పుడు ఉన్న గ్లామర్ కీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా! క్రేజ్, పోటీ వీటిలో ఎటువంటి మార్పు లేదు.
Samantha Ruth Prabhu : స్టార్ హీరోతో సమంత.. ఎట్టకేలకు సినిమా సైన్ చేసిందా..
ఇప్పుడు ఫ్యాన్స్ తలుచుకుంటే దేవతని చేయగలరు. డీ గ్రేడ్ కూడా చేయగల టెక్నాలజీ అందరి చేతుల్లోనూ ఉంది. కానీ అప్పుడు ఇప్పుడు ఆమె దేవతే. ఆవిడ పేరు విన్నా, చూసినా అదే అనుభూతి కలుగుతుంది. సావిత్రి గారి తర్వాత సహజ నటిగా సినిమా ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంది సౌందర్యకి. ఆమె నటలోని సహజత్వం కోసం జనాలు ఉర్రూతలూగేవారు. సౌందర్య ఉంది అంటే చాలు.. సినిమా హిట్ అని హీరోలు, ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయిపోయే వారు. డైరెక్టర్స్ ఊహించిన పాత్రకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆమె నటన.
మహేష్ బాబు – సౌందర్య కాంబోలో మూవీ.. మధ్యలో కథ అడ్డం తిరిగి..
సౌందర్య సినిమా అంటే.. డిస్టిబ్యూటర్లర్లకు, థియేటర్ ఓనర్లకు పండగే. ఆమె ఉన్న పుష్కరంలో (12సంవత్సరాలు) 100కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు అలాంటి హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళ సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు కానీ తీసే దమ్ము, ధైర్యం తీసే వాళ్లకు లేదు. వాళ్ళ చేతిలో ఉన్న కథకి లేదు. గ్లామరస్ రోల్స్ చేస్తూనే తన అంద ప్రదర్శన గురించి తగిన జాగ్రత్తలు, అవగాహన కలిగి ఉండటం వలన సౌందర్య సినిమా అంటే ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండ పిల్లలు, పెద్దలు కలిసి చూసే విధంగా ఉండేవి. ఏదీ ఏమైనా ఆమె ఇప్పుడు ‘దివిని చేరిన భువన తారక’.