Society of the Snow movie review : అక్టోబర్ 13, 1972లో ఉరుగ్వేకి చెందిన ఎయిర్ ఫోర్స్ 571 విమానం కుప్పకూలిపోయింది. ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయణీకులు, 5 విమాన సిబ్బంది ఉన్నారు. ఉరుగ్వే రగ్బీ టీమ్, వారి స్నేహితులు, కటుంబంతో చీలికి బయలుదేరిన విమానం, మార్గ మధ్యంలో ఓ మంచు పర్వతంలో కుప్పకూలిపోయింది.
Venu Swamy : 2024లో ఓ సూపర్ స్టార్ ఆరోగ్య సమస్యలతో సినిమాల నుంచి తప్పుకుంటాడు..
మంచు పర్వతంలో చిక్కుకుపోయిన 45 మందిలో కేవలం 16 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రాణాలతో బయటపడిన వీళ్లు కూడా బతకడం కోసం ప్రకృతి, వాతావరణంలో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ జీవన పోరాటంలో వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? ఎలా బతికి బయటపడ్డారు. ఈ సంఘటనలను డాక్యుమెంటరీ చిత్రంగాగా తీసుకొచ్చారు స్పానిష్ ఫిల్మ్ డైరెక్టర్ జె.ఏ. బయోనా.. దాని పేరే ‘సొసైటీ ఆఫ్ ది స్నో’..
2023, సెప్టెంబర్ 9న వెనీస్‌లో, డిసెంబర్ 13న ఉరుగ్వేలో, డిసెంబర్ 15న విడుదలైన ‘సొసైటీ ఆఫ్ ది స్నో’. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విమాన ప్రమాదంలో 6 మంది ప్రయాణీకులు, 5 విమాన సిబ్బంది అక్కడిక్కడే చనిపోయారు. మిగిలిన 29 మంది అక్కడ నుంచి బయటపడడానికి మార్గాలను వెతకడం ప్రారంభించారు.. మంచు తప్ప, మనిషి జాడ లేని ఆ నిర్మానుష్య ఆ ప్రదేశంలో వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు?
https://www.facebook.com/Raamulamma.Afire
మంచు ఎడారిలో ఎటు వెళ్లాలి? శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న మైనస్ డిగ్రీస్ ఉన్న వాతావరణంలో ప్రాణాలను ఎలా నిలుపుకోవాలి? ఇదే వారికి అసలైన సవాల్… బతకడానికి చచ్చిన శవాలను పీక్కొని తినడం తప్ప మరోదారి లేదు… అత్యంత ఆసక్తికరంగా, ఒళ్లు జలదరించే సన్నివేశాలతో, వాస్తవికంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది… రియలిస్టిక్ డాక్యుమెంటరీలు ఇష్టపడేవారికి ఈ ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ కచ్ఛితంగా నచ్చుతుంది..