Skin Care Tips : చర్మం నిగారింపుని కోరుకొని అమ్మాయిలుండరు. కానీ ఈ బిజీ లైఫ్ కారణంగా అందం గురించి పట్టించుకునే తీరిక ఉండట్లేదు కొంతమందికి, బయట కాస్మెటిక్స్ బ్యూటీ పార్లర్కి వెళ్లి తాత్కాలిక నిగారింపు తెచ్చి పెట్టుకుంటున్నారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో వస్తువులతో మోము మెరిసిపోయే అందం మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలా అంటే . .
* ఒక గిన్నెలో నారింజ తొక్కలు వేసి చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసి, ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అందులోని తొక్కలు తీసి చర్మంపై రుద్దుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతవంతమవుతుంది.
* ఒక 1/2 టేబుల్ స్పూన్ తేనె తీసుకొని మొహం అంతా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..
* నానబెట్టిన బాదంపప్పులను పరగడుపున తింటే చర్మం నిగారింపుగా ఉంటుంది.
* రోజు ఉడకబెట్టిన గుడ్డు తింటే ఫేస్ లో గ్లో తగ్గకుండా ఉంటుంది.
* ఎక్కువ పండ్ల రసం తీసుకోవడం వల్ల మన స్కిన్ కి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివల్ల ఫేస్ గ్లో వస్తుంది.
* వారానికి ఒక్కసారి అయినా కొబ్బరి నూనెతో ఫేస్ మర్దన చేసుకోవాలి.
* అలాగే చర్మంపై మచ్చలు తగ్గాలంటే ఉల్లిపాయ రసంలో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా తరచుగా చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి.