Skin Care Tips : వేదాలు, పురాణాల నుంచి ఆయుర్వేదం వరకు పసుపుకు అధిక ప్రాధాన్యం ఉంది. భారతీయులు శతాబ్దాలుగా పసుపును ఆహారంలో వాడుతూ ఉన్నారు. పసుపు వంటకు రంగు, రుచిని అందించడమే కాదు.. అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రథమ చికిత్స కోసం సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో పసుపు ఒకటి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వ్యాధులను దూరం చేస్తాయి.
హెయిర్ ఫాల్ సమస్యకి సింపుల్ చిట్కా..
అందుకే పూర్వం రోజుల్లో కాళ్ళకి, ముఖానికి మాత్రమే కాదు.. ప్రతి శుక్రవారం స్నానం చేసే ముందు ఒంటికి మొత్తం పసుపు పట్టుకుని చేసేవాళ్ళు అంటా కానీ ఈ మధ్య సోపులకి, క్రీములకి అలవాటు పడిపోయి పసుపును పూర్తిగా తగ్గించేశారు. అందుకే స్కిన్ సహజత్వాన్ని కోల్పోతుంది. అందువల్లే నేటి కాలంలో చర్మ సమస్యలు వస్తాయి.
మన ఫేస్ నల్లగా, డిహైడ్రేట్ అయినప్పుడు, చర్మం పొడిబారినప్పుడు.. అలా డిహైడ్రేడ్ అయిన స్కిన్ మళ్లీ కండిషన్ చేయడానికి పూర్వం రోజుల నుంచి స్త్రీలు క్రమం తప్పకుండా ఉపయోగించే పసుపును ఈ రోజుల్లో కెమికల్స్ మాయలో పడి వాడకం తగ్గించేశారు.
హను రాఘవపూడితో ప్రభాస్ రొమాంటిక్ మూవీ.. మరో ‘రాధేశ్యామ్’ కాదుగా..
వంటింటి చిట్కా..
రెండు టేబుల్ స్పూన్ల పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పాలు, ఆఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఈ మూడింటిని బాగా కలిపి ఫేస్ పైన, మెడ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత వాష్ చేసుకుంటే డిహైడ్రిషన్ అయిన సెల్స్ ని మళ్ళీ హైడ్రేట్ చేసి నార్మల్ కండిషన్ లోకి తీసుకొచ్చి స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. అలాగే పసుపు పాలు కలిపి రాయడం వల్ల ఫేస్ లో గ్లో కూడా పెరుగుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Note : బయట మార్కెట్ లో దొరికే మాములు పసుపులో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి కాబట్టి ముఖానికి మరింత ప్రమాదకరం. ఛాయా పసుపు అని పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు మాత్రమే ఉపయోగించండి.
పాలిచ్చే తల్లులు తీసుకువాల్సిన ఆహారం..