Siddharth Roy Review : ట్రెండ్ పేరుతో విపరీతం.. అర్జున్‌ రెడ్డిని మించి..

Siddharth Roy Review : అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్. ఈ మూవీ తర్వాత పొడువైన జట్టు, గడ్డం పెంచుకుని రాక్షస చర్యలు, విపరీత చేష్టలు చేసే హీరోల కథలు చాలానే వచ్చాయి. అలా టీజర్ నుంచే ఆసక్తి పెంచిన మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’.. ‘అతడు’ వంటి చాలా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేసిన దీపక్ సరోజ్, ఈ ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ ద్వారా హీరో అవుతున్నాడు..

Sundaram Master Review : జస్ట్ పాస్ మార్కులతో పాసైన ఇంగ్లీష్ మాస్టర్..

విపరీతమైన కోరికలు తప్ప, ఎమోషన్స్ లేని ఓ ఫిలాసఫర్ కుర్రాడ్ సిద్ధార్థ్ రాయ్. కనిపించిన ప్రతీ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అలాంటి కుర్రాడు అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇతగాడి వాలకం చూసిన ఎవ్వరైనా ఎన్నాళ్లు ప్రేమిస్తారు, కొన్నాళ్లకే బ్రేకప్ చెబుతుంది. దాంతో సిద్ధార్థ్ కూడా అర్జున్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీరోజూ హీరోయిన్ ఇంటికి వెళ్లి గొడవ చేస్తూ ఉంటాడు. సింపుల్ ఇదే సిద్ధార్థ్ రాయ్ మూవీ కథ..

ఇందులో హీరో క్యారెక్టరైజేషన్, అతని లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా అర్జున్ రెడ్డి మూవీని గుర్తుకు తెస్తాయి. బూతులు, రొమాన్స్, అంతకుమించి విపరీత సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నటిస్తున్నవాడే కాబట్టి దీపక్ బాగానే చేశాడు. అయితే అతని లుక్, విజయ్‌ దేవరకొండను ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. హీరోయిన్ తాన్వీ నేగి బాగుంది.

Masthu Shades Unnai Ra Review : కామెడీతో కనెక్ట్ చేసి, హిట్టు కొట్టేశాడుగా..

రాధన్ అందించిన మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. డైరెక్టర్ వీ యశస్వీ, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తానే రాసుకున్నాడు. అందుకేనేమో అనుకున్న కథను తెరమీద పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఇందులో డైరెక్టర్ చెప్పాలనుకున్న నీతి, మెసేజ్ ఎవ్వరి బుర్రలకు ఎక్కకపోయినా.. బూతులను ఎక్కువగా ఇష్టపడుతున్న నేటి తరానికి ఈ సినిమా నచ్చినా నచ్చొచ్చు… ఇది హిట్టైతే ఇదే పైత్యం మరిన్ని సినిమాల్లో కొనసాగక మానదు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post