Shruti Haasan Reply to Netizen : నార్త్ ఇండియాలో ఉండేవాళ్లకు సౌత్ ఇండియాలో ఉండేవాళ్లంటే ఓ రకమైన చులకన. సౌత్‌లో ఉండేవాళ్ల కంటే నార్త్‌లో ఉండేవాళ్లు కాస్త తెల్లగా ఉంటారని, దక్షిణభారతంలో రకరకాల భాషలు ఉంటే, అటు పక్కవారికి హిందీ మాత్రమే ఉందని.. ఓ రకమైన బలుపు చూపిస్తారు. అందుకే సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఛాన్సులు రావడం తక్కువ. అలాగే నార్త్ హీరోయిన్లు, సౌత్ సినిమాల్లో నటించినా బాలీవుడ్‌లోకి వెళ్లగానే ఇక్కడి సినిమాల గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటారు..
కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్, ఇలా సౌత్‌ని వెటకారం చేయడానికి ప్రయత్నించిన నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘సౌత్ ఇండియా యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ శ్రుతి హాసన్‌కి ఇన్‌స్టాలో మెసేజ్ చేశాడు ఓ నెటిజన్. దానికి శ్రుతి హాసన్.. ‘ok.. ఇది ఓ రకమైన రేసిజం..ఇది కరెక్టు కాదు.. ఇలా వెటకారంగా అడగడం ఏ మాత్రం క్యూట్ కాదు.. మీరు మమ్మల్ని ఇడ్లీ, దోశ, సాంబార్ అని పిలవడం అసలు పద్దతి కాదు. మీకు మమ్మల్ని ఇమిటేట్ చేయడం సరిగ్గా రాదు. కాబట్టి ట్రై చేయకండి.. ’ అంటూ పోస్ట్ చేసింది శ్రుతి హాసన్..
ఫ్లాప్ హీరోలకి హిట్టు దేవతగా మారిన శ్రుతి హాసన్.. ఆఖరికి ప్రభాస్‌కి కూడా..
శ్రుతి హాసన్ పోస్టుపై కూడా నార్త్ ఇండియన్స్ పైత్యం చూపిస్తున్నారు. ‘అన్నా 1 ప్లేట్ ఇడ్లీ, అన్నా ఏక్ ఛాయ్ కుడు..’ అంటూ కామెంట్లు పెడుతూ, అతను అడిగిన దాంట్లో రేసిజం ఎక్కడుందని రివర్సులో శ్రుతిని ప్రశ్నిస్తున్నారు.