Shobu Yarlagadda : ప్రభాస్ మూవీకి లేక లేక పాజిటివ్ టాక్ వచ్చింది. ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ తర్వాత ‘సలార్’లో డైనోసార్లా కనిపించాడు ప్రభాస్. దెబ్బకు ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులన్నీ ‘సలారోడు’ లేపి అవతల పడేస్తాడని అనుకున్నారంతా. అయితే కలెక్షన్లలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో నాన్- రాజమౌళి రికార్డులన్నీ లేపేసిన ‘సలార్’, ‘బాహుబలి 2’, ‘RRR’ కలెక్షన్లను చాలా దూరంలో ఆగిపోయేలా కనిపిస్తోంది. ‘బాహుబలి 1’ కలెక్షన్లను దాటేసిన ‘సలార్’కి, బాలీవుడ్ ‘డంకీ’ వల్ల దాదాపు రూ.200 కోట్ల వరకూ కలెక్షన్లలో కోత పడింది.
‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మూవీ వస్తుందంటే అందరికీ తెలుస్తుంది. అయితే నార్త్‌లో అలా కాదు, ఆఖరికి షారుక్, సల్మాన్, ఆమీర్ ఖాన్లు కూడా తమ మూవీని ప్రమోట్ చేయడానికి సినిమా మాల్స్‌కి, టీవీ ప్రోగ్రామ్స్‌కి వెళ్తారు. ఎందుకంటే ఎంత ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తే, అంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టవచ్చని వాళ్లకు తెలుసు.
సలార్ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్..
సలార్ మూవీకి నేనే నిర్మాతని అయ్యి ఉంటే, రిలీజ్‌కి మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలెట్టేవాడిని. సలార్ మూవీకి వచ్చిన టాక్‌కి ఈజీగా రూ.1000 కోట్లు వసూలు చేసేవాళ్లం…’ అంటూ కామెంట్ చేశాడు ‘బాహుబలి’ చిత్ర నిర్మాతల్లో ఒక్కడైన శోభు యార్లగడ్డ..