Shivam Bhaje Movie Review : అశ్విన్ బాబు ప్రయత్నం ఫలించిందా..

Shivam Bhaje Movie Review : యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘రాజుగారి గది 3’, ‘హిడింబ’ సినిమాలు చేసిన అశ్విన్ బాబు ప్రస్తుతం ‘శివమ్ భజే’ అనే మూవీ చేశాడు. అబ్దుల్ అప్సర్ హుస్సేన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.

హీరో ఓ లోన్ రికవరీ ఏజెంట్. హీరోయిన్ ప్రేమలో పడి, అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌లో కళ్లు పోగొట్టుకుంటాడు. ఆపరేషన్ తర్వాత మళ్లీ అతనికి కళ్లు తిరిగి వస్తాయి. అయితే తనకు పెట్టిన కళ్ల తర్వాత కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ కళ్లు ఎవరివి? ఆ కళ్లు ఇచ్చిన వ్యక్తి కథ ఏంటి? ఇదే ‘శివం భజే’ మూవీ కథ..

ఓ సోషల్ మీడియా ఫాంటసీ కథాంశాన్ని రాసుకున్న డైరెక్టర్, దానికి భక్తి, దేవుడు అనే అంశాలను జోడించి మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు. అయితే అనుకున్నట్టుగా స్క్రీన్ ప్లే విషయంలో ఫోకస్ పెట్టకపోవడం వల్ల ‘శివం భజే’ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. హైపర్ ఆలీ కామెడీ, అశ్విన్ బాబు హీరోయిజం తప్ప సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ పాతదే, స్క్రీన్ ప్లే విషయంలో అయినా కాస్త ఫోకస్ పెట్టి ఉంటే మరో ‘హిడింబ’ స్టైల్ సినిమా అయ్యి ఉండేది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post