Sembi Movie : కొన్ని కథలు, సినిమాలు కాలేవు. అన్ని కథలు, సినిమా కథలు కావు. కోవై సరళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సెంబి’ సినిమా కూడా అలాంటిదే..! కొడైకెనాల్ ఏరియాలోని ఓ కొండ ప్రాంతంలో ప్రశాంతంగా జీవిస్తున్న ఓ అమ్మమ్మ, తన 10 ఏళ్ల మనవరాలి కథే ‘సెంబి’.
Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?
మనసు వెళ్లిన ప్రతీ చోటికి మనిషి వెళ్లకూడదు. అయితే మనిషి, తాను వెళ్లే ప్రతీ చోటుకి తనతో పాటు కల్మషం కూడా వెంటేసుకుపోతాడు. అందుకే ఈ భూమ్మీద అన్యాయం జరగని ప్రాంతం ఎక్కడా ఉండదు. అలాగే బడుగువారికి నాయ్యం జరిగిన సందర్భం కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు.
ఎన్నో అత్యాచారాలు, మరెన్నో హత్యాచారాలు, మహాసముద్రాలు నింపేసే కన్నీళ్లు, ఎంతో రక్తం పారితే కానీ #pocso (2012), #నిర్భయ (2013), #దిశా (2019) వంటి చట్టాలు రాలేదు. చెప్పుకోవడానికి చట్టాలు అయితే వచ్చాయి కానీ, ఈ కాగితం మీద చట్టాలు, కాగితపు నోట్లను బీరువాలో దాచుకున్నవాళ్లకి ఎప్పుడూ చుట్టాలే..
అందుకే ఎన్ని చట్టాలు వచ్చినా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగడం లేదు. అన్నిసార్లు దోషికి పడే శిక్ష, బాధితురాలికి నాయ్యం చేయదు. శిక్షల పట్ల అవగాహన కన్నా, ఆ తప్పు వల్ల ఎదుటివారికి కలిగే నొప్పి, బాధ ఏంటో అర్థం అయ్యేలా చేసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
రేప్ చేసేవాళ్లను స్కూల్‌కి తీసుకెళ్లి పాఠాలు చెప్పాలా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ నేరం చేస్తున్నవాళ్లలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు కూడా ఉన్నారు. చెప్పకుండా చెప్పు తీస్కుని కొడితే జ్ఞానం రాదూ.. తప్పు తాలూకు జ్ఞాపకం ఉండదు. ఎందుకు శిక్ష వేశారు అని గుర్తు కూడా ఉండదు. అందుకే ఇక్కడ శిక్ష అనేది రేప్ చేస్తే ఉరి వేస్తారు అని కాకుండా, తప్పుగా చూస్తే తాట తీస్తారు అని తెలియకపోవడమే.. ఒకవేళ ‘తెలిసినా’ తప్పించుకొని తిరగ్గలం అనే ధీమా మన చట్టాలు కల్పించడమే.. ఎందుకంటే తప్పు చేసే వారిని బొక్కలో వేయాల్సిన చట్టంలో ఎన్ని బొక్కలున్నాయో అందరికీ బాగా తెలుసు..
Animal Movie Trolls : ‘యానిమల్’ మూవీని కార్నర్ చేస్తున్న తమిళులు..
న్యాయం కోసం పోరాడాలి? అనే ఆలోచన ఉన్నా? ఎంత పోరాడినా న్యాయం జరగదు? ఎందుకంటే ఇక్కడ మీడియాకి కానీ, జనాలకి కావాల్సింది కాసింత కాలక్షేపం మాత్రమే.. ఏదైనా అన్యాయం జరిగిందని మీడియా సెన్సేషన్ చేసినప్పుడు, ‘justice for’ అని పోస్ట్ పెట్టి, సోషల్ మీడియాలో ప్రొఫైల్ తీసేయడమే ఇప్పుడు అతి పెద్ద ఉద్యమం.. జనాల ఆలోచనల్లో మార్పు రావాలంటే ఇంకా ఎంతమంది ఆడపిల్లల రొమ్ముల నుండి రక్తం కారాలో.. ఇంకా ఎంతమంది పిల్లల యోని ఛిద్రం కావాలో..!! మనసును తడి చేసే ఓ అమ్మమ్మ ఆవేదన తెలియాలంటే ‘సెంబి’ మిస్ కాకుండా చూడండి..