Sankranthi Movies 2024 : సంక్రాంతికి 4 సినిమాలు విడుదల అయ్యాయి. జనవరి 11న ప్రీమియర్స్ పడిన ‘హనుమాన్’ మూవీ, 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, సూపర్ హిట్టు కొట్టేసింది. యూఎస్ మార్కెట్‌లో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘హనుమాన్’ మూవీ, నాలుగు రోజుల్లో 3 మిలియన్ల వసూళ్లు సాధించింది. కేవలం 5 లక్షల డాలర్లకు యూఎస్ రైట్స్‌ని విక్రయించారు. ప్రీమియర్స్‌తోనే ఆ వసూళ్లు రాబట్టింది ‘హనుమాన్’…
Prabhas New Name : లక్ కోసం పేరు మార్చుకున్న ప్రభాస్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో..
ఫుల్ రన్‌లో దాదాపు 15 మిలియన్ల డాలర్లు వసూళ్లు రావచ్చని అంచనా. నార్త్‌లోనూ హిందీ వర్షన్‌కి లాభాల పంట పండుతోంది. నైజాంలో రూ.7 కోట్లకు రైట్స్ విక్రయించగా 2 రోజుల్లోనే ఆ మొత్తం రిటర్న్ వచ్చేసింది. ఆంధ్రా ఏరియాలోనూ ‘హనుమాన్’ మూవీకి లాభాలు మొదలైపోయాయి. ఇప్పటికే రూ.30 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది ‘హనుమాన్’…
‘నా సామి రంగ’ మూవీ కూడా 3 రోజుల్లో దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ రైట్స్‌ని రూ.19 కోట్లకు విక్రయించగా రూ.20 కోట్లు వచ్చేశాయి. నాలుగో రోజు నుంచి నాగ్ సినిమా లాభాలు మొదలవుతాయి. మహేష్ ‘గుంటూర్ కారం’ మూవీ రైట్స్‌ని ప్రపంచవ్యాప్తంగా రూ.133 కోట్లకు విక్రయించారు. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల బిజినెస్ జరిగింది..
Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?
తొలి రోజు 40 శాతం రికవరీ కాగా, ఇప్పటికి దాదాపు 65 శాతం రికవరీ చేయగలిగింది ‘గుంటూర్ కారం’… కలెక్షన్లు రోజురోజుకీ పడిపోతున్నా టికెట్ రేటు తగ్గించకపోవడం ‘గుంటూర్ కారం’ రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే కానీ, తొలి రోజు వచ్చిన టాక్‌తో పోలిస్తే… మంచి రిజల్ట్ రాబట్టినట్టే..
https://www.facebook.com/Raamulamma.Afire?mibextid=ZbWKwL
‘సైంధవ్’ మాత్రం వెంకీకి ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాలేదు. దీంతో ‘సైంధవ్’ మొదటి 3 రోజుల్లో 30 శాతం మాత్రమే వెనక్కి రాబట్టగలిగింది. చూస్తుంటే ‘సైంధవ్’ డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతున్నట్టే..
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?