Sankranthi Festival 2024 : సంక్రాంతి వచ్చేసింది.. సంబరాలు తెచ్చేసింది.. తెలుగు ఇళ్లల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి, మరి ముఖ్యంగా గోదావరి వాళ్లకి. సంక్రాంతి పండుగ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే బతుకుతెరువు కోసం పట్నం వెళ్లిన కొడుకులు, కూతుర్లు, అల్లుళ్లు అందరినీ ఒకటి చేసే పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే కుటుంబాలు చాలానే ఉన్నాయి. పట్టణాలన్నీ బోసిపోయిన పల్లెలన్నీ కలకల్లాడుతూ ఆనందంగా బంధువులతో స్నేహితులతో జరుపుకునే పండగే సంక్రాంతి.
Bhogi Festival 2024 : భోగి మంటలెందుకు వేస్తారు.. భోగి పళ్ళ విశిష్టత..
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు, వేదికైనా గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి సందడి మరింత కోలాహలంగా ఉంటుంది. గోదావరి వాళ్లు అంటే గుర్తొచ్చేది వాళ్ళ మాటల్లో వెటకారమే కాదు, ఆయ్ లు అండీలు, తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, రంపచోడవరంలో బొంగులో చికెన్, అంబాజీపేట పొట్టిక్కలు మాత్రమే కాదండోయ్.. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగే బెస్ట్ సంక్రాంతి సంబరాలు కూడాను. దేశమంతటా సంక్రాంతి మూడు రోజులైతే గోదావరి వాళ్లకి మాత్రం నెల అంతా ఉంటుంది. హరిదాసులు గంగిరెద్దులు కోడిపందాలు కోలాహలాలు. గాలిపటాలు పిండి వంటలు కొత్త అల్లుళ్ల కళకళలు లాడుతుంది.
ఇంకా సిటీలో ఉన్న వాళ్లు, దేశం నలుమూలల్లో ఉన్న టికెట్స్ దొరకకపోయినా ఎంత రేట్ అయినా ఎలా అయినా సరే సొంత ఊరు సంక్రాంతికి వెళ్లాల్సిందే. సంవత్సరం మొత్తం అయినవాళ్ళకీ దూరంగా కష్టపడినా ఇంటికి వెళ్ళగానే ఫ్రెండ్స్, చుట్టాలను కలుస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఊరంతా ఎక్కడ చూసినా గొబ్బెమ్మలు ముగ్గులు, పూలతో డెకరేట్ చేసే ఇల్లు, లంగా వోణీల అమ్మాయిలు, కొత్త సినిమా రిలీజ్ లు, క్రికెట్ టోర్నమెంట్లు, ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి అనేది మన అయిన వాళ్లతో లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ.
Sankranthi Movies 2024 : సంక్రాంతి సినిమాల టార్గెట్ ఎంతంటే..?
అందరితో కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపే ఆ క్షణాలు లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్.. ఇలా ఒకటా, రెండా సంక్రాంతి పండుగ అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. ఇంకా పండగ అయిపోయి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ బాధ మళ్లీ సంవత్సరం వరకు మన వాళ్ళందరినీ ఒకేచోట చూడలేము, కలవలేము అన్న ఆలోచనలతో ఒక వారం పది రోజులు ఆ ట్రాన్స్ లోనే ఉంటాం.
మైండ్ డైవర్ట్ అవ్వదు, ఎంత పెద్ద వాళ్ళం అయిపోయిన సంక్రాంతికి మన ఊరు వెళ్లడం అనేది ఒక ఎమోషన్. మరి ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఊరు వెళ్తున్నారు కదూ..
భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ..
TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..