Sandeep Reddy Vanga : ‘పుష్ప’ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిపై తాజాగా స్పందించాడు.
‘యానిమల్’ కోసం 500 కేజీల మిషన్ గన్.. ఈ సెంటిమెంట్ తేడా కొట్టిందో..
‘అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం. అయితే మనవాళ్లు 69 ఏళ్లుగా ఈ అవార్డును సరిగ్గా పట్టించుకోలేదని నాకు అనిపించింది. నేషనల్ అవార్డు గెలవాలని కరెక్టుగా నామినేషన్లు పంపించి ఉంటే ఇప్పటికే ఎప్పుడో మనకి బోలెడన్ని జాతీయ అవార్డులు వచ్చేవి. ఎందుకు మన దగ్గర మంచి నటులు లేరా?’ అంటూ వ్యాఖ్యానించాడు సందీప్ రెడ్డి వంగా..
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో చేసిన ‘యానిమల్’ మూవీ, డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ మూవీ మొదటి వారంలోనే రూ.500 కోట్ల దాకా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్. ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్న సందీప్ రెడ్డి వంగా, ఆ మూవీ సెట్స్‌లోకి వెళ్లడానికి ముందే అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడు.
మహేష్ ‘యానిమల్’ కాదు, ఆయనకి చెప్పింది ‘డెవిల్’ : సందీప్ రెడ్డి వంగా
మార్చి నెలలోనే సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబో మూవీ కన్ఫార్మ్ అయ్యింది. సందీప్ రెడ్డి కథ కూడా వినకుండానే అల్లు అర్జున్, అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం ‘పుష్ప 2’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.