Sandeep Kishan : సినిమా బాగుంది, చూడండి అనే పొజిషన్ దాటిపోయి.. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎమోషనల్ అయిపోవడం, నా సినిమాకి ఎందుకు రావడం లేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి విపరీత చేష్టలకు దిగజారిపోయింది సినీ ఇండస్ట్రీ. తాజాగా హీరో సందీప్ కిషన్ కూడా తన సినిమాకి ప్రమోషన్ కోసం స్టాఫ్‌కి జీతాలు ఇవ్వలేని పొజిషన్‌కి వచ్చేశానంటూ గోడు వెల్లబుచ్చుకున్నాడు. ఏం చేసినా సినిమాని జనాల దగ్గరికి చేర్చి, క్యాష్ చేసుకోవడమే అందరి ప్రధాన కర్తవ్యం.
Anushka Shetty : శీలావతిగా మారిన అనుష్క శెట్టి..
‘సామజవరగమన సినిమా తీసిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు, నేను చేసిన డీకే బోస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. అతని ఫస్ట్ మూవీ వివాహ భోజనంబుని నేనే ప్రొడ్యూస్ చేశాను. అంతేకాదు సామజవరగమన కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాను. విరూపాక్ష డైరెక్టర్ లోకేశ్‌ని కూడా నేనే తీసుకొచ్చాను.
అతని మొదటి సినిమా భం భోలేనాథ్‌కి ముందు నాతో చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ తీయడానికి ముందు ఏడాది పాటు నాతో ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే సినిమా చేయాల్సింది. ఏడాదికి పైగా ఆ సినిమా కోసం పనిచేశాం. కానీ వర్కవుట్ కాలేదు.. నా వల్ల ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు మంచి బ్రేక్ దక్కింది. నాకే ఇంకా సరైన బ్రేక్ రాలేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు హీరో సందీప్ కిషన్.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..