Samantha, Savitri, Silk Smitha : సావిత్రి.. ఈ పేరు వింటే చాలు.. తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు. మహానటి సావిత్రి గురించి తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. అయితే తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. సినీమాలలో అగ్ర కథానాయకగా “మహానటిగా” అగ్రతాంబూలం అందుకున్న నటి సావిత్రి గారు. ఆవిడ జీవితం గురించి “మహానటి” సినిమా ద్వారా కొంత వరకు చాలామందికి అర్థమై ఉంటుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళను తను సహాయం చేయలేని స్థితిలో ఉండికూడా ఆదుకోవడం ఆమె గొప్పదనానికి చిహ్నం.
నాడు ఎన్టీఆర్, నేడు మెగాస్టార్, మరి రేపు..!?
ఎంతోమంది స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ NTR, ANR సైతం సావిత్రిగారి డేట్స్ ఉంటేనే సినిమా చేస్తాం అనే స్థాయికి ఆమె చేరుకుంది. కోట్లలో ఆస్తి, నౌకర్లు, భవంతి, కలియుగ వైభవం చూసిన ఆమె.. బెంగుళూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కోమాలోకి వెళ్లి తరువాత కొద్ది రోజుల్లోనే ఒక అనామకురాలిగా తనువు చాలించింది. ఆమె బాగున్నప్పుడు సాయం పొందిన వాళ్ళు, ఆమె కాల్ షీట్స్ కోసం ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసి లాభాలు పొందిన వాళ్ళు ఎవరూ ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేకపోయారు.
అస్సలు వీళ్లంతా ఆమెను ఎందుకు వదిలేశారు..!? ఆమెకి ఇతరుల సహాయం తీసుకోవడం నచ్చదు. ఆమెతో వందల సినిమాలు తీసిన ఏ ఒక్కరూ కూడా ఆపదలో ఆమె వెంట నిలబడలేదు. అప్పటికే ఏర్పాటైన తమిళనాడు ప్రభుత్వం కానీ, ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాలు కానీ సావిత్రికి ఎటువంటి సహాయం చెయ్యలేదు. మేమున్నాం అన్న ధైర్యం చెప్పలేదు, భరోసా ఇవ్వలేదు. ఎందుకు..!?
హద్దుల్లేని ప్రేమ.. ఆమె కోసం అతడిగా మారి.. చివరకు విషాదాంతమై..
Silk Smitha :
సిల్క్ స్మిత.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం.. గ్లామరస్ పాత్రలు చేస్తూ అప్పటి కుర్రకారు హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తన కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కే మత్తెక్కించిన గ్లామరస్ యాక్టర్ సిల్క్ స్మిత. ఓ మూవీలో ఐటమ్ సాంగ్ లో సిల్క్ స్మిత ఉంటే చాలు మూవీ హిట్.. హీరో, హీరోయిన్ తో పనిలేదు! ఆమె పబ్ డాన్సర్ గా కాలు కదిపితే చాలు.. కనక వర్షమే. అప్పట్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంది సిల్క్ స్మిత.
ఆమె బయటకు వెళ్లినా.. సెట్లో ఉన్నా.. ఆమెపై ఈగ వాలకుండా చూసుకునే మనుషులు ఎప్పుడూ ఆమె పక్కనే వుండేవారు. కానీ ఆమె తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రం “నా” అనే వాళ్లేవరు తనపక్కన లేకుండా పోయారు. సిల్క్ స్మిత జీవితాన్ని డర్టీ పిక్చర్ గా డైరెక్టర్ మిలన్ లుథ్రియా తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్ లో నటించారు.
Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..
Samantha :
సౌత్ ఇండియాలొనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత, ప్రస్తుతం బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో కూడా నటిస్తుంది. మొన్నటి వరకు హీరోలందరూ తమ సినిమాలలో ఉండాలని కోరుకునే క్రేజీ హీరోయిన్ సమంత. సామ్ ముద్దు ముద్దుగా పలికే “I Hurt.. బుంగ మూతి పెట్టుకున్నాను”.. అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.
ఒకప్పుడు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సమంత క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. కెరీర్ పీక్స్ లో ఉండగానే తనతో ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్యను వివాహమాడింది సమంత. వీరి వివాహానంతరం వీరిని అభిమానులు ముద్దుగా “చైసామ్” పిలుచుకునే వారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నోఏళ్ల ప్రేమ అనంతరం పెళ్లి చేసుకున్నా ఐదేళ్లకే వీరి వైవాహిక బంధానికి శుభం కార్డు పడింది.
లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే, ‘వీరభోగ వసంతరాయలు’ పుడతాడని ఎన్టీఆర్‌కి చెప్పిన జ్యోతిష్యుడు..
ఆ తర్వాత సూపర్ హిట్స్ తో కెరీర్ మళ్లీ ఊపందుకుంటుండగానే.. హెల్త్ ఇష్యూ రావడంతో సమంత కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. హిట్స్ తప్పనిసరి కావడం, దీనికి తోడు యంగ్ హీరోయిన్స్ తో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎంతోమంది హీరోలు తమ క్రష్ సమంత అని చెప్పినప్పటికీ, ఆన్ స్క్రీన్ కోసం మాత్రమే ఆమెతో క్లోజ్ గా ఉంటూ ఆమె పేరుని గ్లామర్ ని వాడుకుంటున్నారనిపిస్తుంది.
సావిత్రి, సిల్క్ స్మిత జీవితంలో జరిగినట్టే.. సమంత విషయంలో కూడా జరగబోతుందా.. ! అవసరం కోసం వాడుకుని వదిలేస్తుందా ఫిలిమ్ ఇండస్ట్రీ..!??
Note : యాదృచ్ఛికంగా వీరు ముగ్గురి పేర్లు S తో స్టార్ట్ అవ్వడం గమనార్హం. సావిత్రి, సిల్క్ స్మిత, సమంత.. SSS….
https://www.facebook.com/Raamulamma.Afire?mibextid=ZbWKwL