Samantha Ruth Prabhu : ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కొండ సురేఖ ఇటీవల సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి, దీనిపై సమంత సూటిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
“నా విడాకులు పూర్తిగా వ్యక్తిగత అంశం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాను,” అంటూ సమంత తన ఇన్స్టా స్టోరీలో పేర్కొన్నారు.
సమంత తన వ్యక్తిగత జీవన ప్రయాణం గురించి మాట్లాడుతూ, స్త్రీగా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. “స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి,” అని వ్యాఖ్యానించారు.
Samantha Ruth Prabhu : స్టార్ హీరోతో సమంత.. ఎట్టకేలకు సినిమా సైన్ చేసిందా..
ఈ సందర్భంగా మంత్రిగా ఉన్న కొండ సురేఖకు సమంత సూచన చేయడం గమనార్హం. “కొండ సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు నేను గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి,” అంటూ తాను ఎదుర్కొన్న మార్పులను గర్వంగా గుర్తు చేశారు.
తన విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగినవని, ఎటువంటి రాజకీయ కుట్రకు సంబంధం లేదని సమంత స్పష్టం చేశారు.
“దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలానే ఉండాలని కోరుకుంటున్నాను,” అంటూ సమంత వేడుకున్నారు. సమంత ఈ ప్రకటన ద్వారా తన వ్యక్తిగత జీవితం గురించి జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టాలని, వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల గౌరవం చూపాలని ప్రజలకు, నేతలకు విజ్ఞప్తి చేశారు.