Samantha Ruth Prabhu : స్టార్ హీరోతో సమంత.. ఎట్టకేలకు సినిమా సైన్ చేసిందా..

Samantha
Samantha

Samantha Ruth Prabhu : గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి, నిజంగానే మాయ చేసేసింది సమంత రూతు ప్రభు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేసింది.. సోలోగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి, సూపర్ హిట్లు కొట్టిన సమంత, ఏడాదిగా ఏ సినిమా సైన్ చేయలేదు..

విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’ సినిమా చేసిన సామ్, ఆ తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. సమంత బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు… ఆ తర్వాత రాజ్ కుమార్ హిరాణీ, షారుక్ ఖాన్ కాంబోలో రాబోయే సినిమాలో సమంతనే హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి.. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రాలేదు.

Samantha Ruth Prabhu : సమంతకు ఏమైంది..

తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ హీరోగా తెరకెక్కే సినిమాలో సమంత నటించబోతుందని సమాచారం. చిత్ర యూనిట్ అయితే సమంతనే మా సినిమాలో హీరోయిన్ అంటూ ప్రకటించింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి సమంత రాలేదు. ఇన్‌స్టాలో కూడా ఈ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాలో అయినా సమంత నటిస్తుందా? లేదా? అనే డౌట్స్ వస్తున్నాయి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post