Samantha Ruth Prabhu : సోషల్‌మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకూ దూరంగా ఉంటున్న సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ పడుతుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమెకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.
సామ్ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలాగే కొన్ని రకాల ఆహారాలు మరియు పానీయాలను నివారించడం గురించి చర్చించింది. హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడంలో తన తప్పును కూడా అంగీకరించింది. సమంత మాట్లాడుతూ, “గతంలో ఏమీ తెలియక తప్పులు చేశాను కానీ, ఇప్పుడు అలాంటి యాడ్స్ చేయడం మానేశాను” అని వెల్లడించింది.
Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?
ప్రస్తుతం సమంత ‘కామన్ వైరల్’ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన మందులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు డిస్టిల్డ్ వాటర్ మిశ్రమం మ్యాజిక్ లాగా పనిచేస్తుందని ఆమె సూచనలు ఇచ్చింది.
అలాగే రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్‌ను “యోధురాలు” అంటూ సంభోదిస్తూ, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో హీనా ఖాన్ వీడియోను పోస్ట్ చేసింది. క్లిప్‌లో, హీనా తన కీమోథెరపీ కోసం వెళ్తున్నట్లు కనిపించింది. సమంత ఆ క్లిప్‌కి “నీ కోసం ప్రార్థిస్తున్నా హీనా ఖాన్, నువ్వు ఒక యోధురాలు” అని క్యాప్షన్ ఇచ్చింది.