RRR రికార్డు బ్రేక్ చేసిన ‘సలార్’… అయినా బ్రేక్ ఈవెట్ అవ్వాలంటే….

ప్రభాస్ ‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 4 రోజుల్లో రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ‘సలార్’కి క్రిస్‌మస్ డే హాలీడే బాగా కలిసి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డు ‘సలార్’ పేరిట నమోదైంది..

సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ మల్టీస్టారర్‘RRR’ మూవీ, నాలుగో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.17.73 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును ‘సలార్’ బ్రేక్ చేసేసింది. నాలుగో రోజు ‘సలార్’కి రూ.18.05 కోట్ల వసూళ్లు వచ్చాయి. ‘బాహుబలి 2’ మూవీ నాలుగో రోజున రూ.14.65 కోట్లు వసూలు చేయగా, మహేష్ ‘సర్కారువారి పాట’ రూ.12.06 కోట్లు తెచ్చింది..

నైజాం ఏరియాలో 4 రోజుల్లో రూ.54 కోట్లకు పైగా షేర్ సాధించింది ‘సలార్’. నైజాంలో రూ.60 కోట్లకు ‘సలార్’ రైట్స్‌ని అమ్మారు. ఫుల్ రన్‌లో ‘సలార్’ మరో రూ.6 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. న్యూఇయర్ వీకెండ్ కలిసి వస్తే, నైజాంలో మూవీ హిట్టు కొట్టేస్తాడు ‘సలారోడు’.

‘సలార్’ మూవీపై బాలీవుడ్‌ రాజకీయం.. ఆ దేశాల్లో ‘డంకి’ మూవీకి భారీగా థియేటర్లు..

అయితే ఆంధ్రాలో అమ్మిన రేటుకి, వస్తున్న కలెక్షన్లకు చాలా తేడా ఉంది. ఆంధ్రా, సీడెడ్ మొత్తంలో రూ.65 కోట్లకు అమ్మారు. సీడెడ్‌లో మరో రూ.9 కోట్లు, ఆంధ్రాలో మరో రూ.12 కోట్లు వసూలు చేస్తే ‘సలార్’ హిట్ రేంజ్ ఎక్కుతుంది. ఆంధ్రాలో టికెట్ రేటు కేవలం రూ.40 పెంచింది ప్రభుత్వం. ఇది కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. నైజాంలో పెరిగినట్టుగా రూ.75- రూ.100 పెరిగి ఉంటే ఈ పాటికి 75 శాతానికి పైగా వసూలు చేసి ఉండేది..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post