Salaar Movie Rajamannar Mistake Explained : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తోంది. లేక లేక మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో అంతటా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ప్రభాస్ దెబ్బకి షారుక్ ఖాన్ ‘డంకీ’ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో వెనక బడింది.
‘కేజీఎఫ్ 3’ కథ రెడీ! కానీ డైరెక్టర్ నేను కాదు… పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..
కన్నడ ‘ఉగ్రం’ సినిమా కథకి, ‘ఖాన్సార్’ బ్యాక్‌గ్రౌండ్ జోడించి… ‘కేజీఎఫ్’ లెవెల్ ఎలివేషన్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ‘సలార్’ తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. మూవీలో జగపతి బాబు రాజా మన్నార్ కూతురు రాధారామ మన్నార్‌గా శ్రియా రెడ్డి అందర్నీ ఫిదా చేసేసింది. రాధారమ భర్తగా బాబీ సిన్హా నటించాడు..
క్లైమాక్స్‌లో రాధా రామ, తన భర్త శౌర్యంగ వంశానికి చెందిన వాడని తెలిసి షాక్ అవుతుంది. శౌర్యంగ వంశస్థులకు గుర్తుగా వీపు మీద మచ్చలు ఉంటాయి. కొన్నేళ్లుగా భర్తతో కాపురం చేస్తున్న రాధా రామ, తన భర్త వీపు మీద మచ్చలు కూడా గమనించలేకపోయిందా? మరీ ఎంత చీకట్లో కాపురం చేసినా ఇంత చిన్న లాజిక్, ప్రశాంత్ నీల్ ఎలా మరిచిపోయాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు – సౌందర్య కాంబోలో మూవీ.. మధ్యలో కథ అడ్డం తిరిగి..
‘సలార్’ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్.. జనాలకు తెగ నచ్చేసినా.. ఖన్సార్ కథ, కథనం, స్క్రీన్ ప్లే సాధారణ జనాలకు ఎక్కాలంటే సలార్ 2, సలార్ 3 కూడా రిలీజ్ కావాల్సిందే. చదరంగంలోని ఎత్తులను తన స్క్రీన్ ప్లేలో జోడించి, ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేసినా.. పేలింది మాత్రం డైనోసార్ రేంజ్ ఎలివేషన్స్ మాత్రమే..