Sai Pallavi : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలి. హీరోయిన్ల విషయంలో ఈ ఫార్ములా పక్కగా వర్కవుట్ అవుతుంది. అయితే సాయి పల్లవి (Sai Pallavi) మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, యూత్‌కి ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది సాయి పల్లవి.
రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!
శేఖర్ కమ్ముల ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్ల భానుమతిగా తెలుగువారికి కూడా తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అయితే సాయి పల్లవి మాత్రం అందరి హీరోయిన్లలా వచ్చిన ప్రతీ మూవీని చేసుకుంటూ పోలేదు.
ఎక్కువ మేకప్ లేకుండా.. సహజత్వం ఉట్టిపడేలా కనిపించే సాయి పల్లవి, స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. నానితో చేసిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘మారీ 2’ వంటి ఒకటి రెండు సినిమాలు పక్కన బెడితే, సాయి పల్లవి చేసిన ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం.
‘పడి పడి లేచే మనసు’లో మెమొరీ లాస్‌తో బాధపడే అమ్మాయిగా కనిపించిన సాయి పల్లవి, ‘లవ్ స్టోరీ’ సినిమాలో చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన యువతిలా కనిపించింది. ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసిగా కనిపించి, కళ్లతో అభినయించిన ఈ కోయంబత్తూర్ చిన్నది, ‘విరాట పర్వం’లో నక్సలైట్‌ని ప్రేమించి, అతని ప్రేమ కోసం నక్సలైట్‌గా మారే స్వచ్ఛమైన పల్లెటూరి అమ్మాయిలా హృదయాలను కొల్లగొట్టింది.
iSr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
‘గార్గి’లో నేరారోపణతో అరెస్టైన తండ్రిని విడుదల చేసేందుకు కష్టపడే ఓ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించి, అవార్డులు కొల్లగొట్టిన సాయి పల్లవి.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలను ఒప్పుకుంది. శివ కార్తీకేయన్ (Shiva Karthikeyan) తో ఓ తమిళ్ సినిమా చేస్తున్న సాయి పల్లవి, నాగచైతన్య (Naga Chaitanya), చందూ మొండేటి కాంబో మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించింది.
అనుపమ పరమేశ్వరన్ లాంటి కొందరు హీరోయిన్లు, కెరీర్ ఆరంభంలో పద్ధతిగా కనిపించి, ఆ తర్వాత అవకాశాల కోసం స్కిన్ షో చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సాయి పల్లవి మాత్రం హీరో ఎవ్వరైనా, రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా.. లిప్ లాక్స్ ఉన్నా.. ఎక్స్‌ఫోజింగ్ చేయాల్సి వచ్చినా.. క్యారెక్టర్ నచ్చకపోయినా.. ఆ సినిమా చేయనని పక్కాగా చెప్పేస్తోంది. ఈ విషయంలో మాత్రం సాయిపల్లవి, నిజంగా ‘హైబ్రీడ్ పిల్లే’ అబ్బా..
స్వాతి చెప్పినట్టుగా ‘month of madhu’ మూవీలో నిజంగా అంతుందా?