బాలీవుడ్‌లో సాయి పల్లవి! ఏకంగా ఆమీర్ ఖాన్ కొడుకుతో సినిమా… ఆ సీన్స్ చేస్తుందా..

Sai Pallavi Bollywood Movie : క్రేజ్ ఉన్నా, చాలా సెలక్టివ్‌గా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటోంది సాయి పల్లవి. కథ నచ్చకపోతే, పాత్రకి ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సినిమా చేయడానికి ఒప్పుకోదు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి త్వరలో బాలీవుడ్ సినిమా చేయబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Sai Pallavi Bollywood Movie

బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షన్’ ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించే రెండో సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ప్రసుతం యష్ రాజా ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ‘మహారాజా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ మూవీ ‘లవ్ టుడే’ రీమేక్‌లో నటించబోతున్నాడు జునైద్ ఖాన్. ఈ మూవీకి ‘ఢిల్లీ బెల్లీ’, ‘ధోబీ ఘాట్’ ఫేమ్ సునీల్ పాండే డైరెక్టర్..

Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..

‘లవ్ టుడే’ రీమేక్‌లో జునైద్ ఖాన్ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అతని డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ టుడే’లో లిప్ లాక్ సీన్స్, కొన్ని ఎక్స్‌ఫోజింగ్ సీన్స్ కూడా ఉంటాయి. హిందీలోకి రీమేక్ చేస్తే ఆ సీన్స్ డోస్ మరింత పెరుగుతుంది. మరి సాయి పల్లవి ఇలాంటి సీన్స్ చేయడానికి ఒప్పుకుంటుందా? ఇది కేవలం బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రచారమేనా? కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ప్రస్తుతం నాగచైతన్య- చందూ మొండేటి సినిమా చేస్తున్న సాయి పల్లవి, తమిళ్‌లో శివకార్తీకేయన్ సినిమా సైన్ చేసింది.

రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post