ఎకరాకి రూ.15 వేలు అన్నారు! ఒక్క రూపాయి వేశారు… రైతు బంధు ఇక ‘బంద్‌’యేనా..

Rythu Bandhu : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ రావడానికి ప్రధాన కారణం రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీయే. బీఆర్‌ఎస్ పార్టీ హయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడంతో పాటు లోకల్ ఎమ్మెల్యేలపై పెరిగిన అసంతృప్తి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమయ్యాయి. ఆ విషయం పక్కనబెడితే కాంగ్రెస్‌కి ఓటు వేస్తే ఎకరానికి రూ.15 వేలు వస్తాయనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులు ఆశపడి, చేతి గుర్తుకి ఓట్లు వేశారు..

జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?

అయితే గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విషయంలో రోజుకో మాట మారుస్తోంది. బీఆర్‌ఎస్ హయంలో 200 ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములకు కూడా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు బంధు పైసలు పడేవి. అయితే ఇది కరెక్ట్ కాదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 5 ఎకరాలు, అంత కంటే తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట..

దేశానికి రాజు, వెన్నుముక “రైతు”..

అయితే ఇప్పటిదాకా రైతు భరోసా పథకం గురించి ప్రణాళిక పూర్తిగా సిద్ధం కాలేదు. దీంతో రైతు బంధు కింద డబ్బులు చెల్లించిన వారికి నిధులు విడుదల చేసింది కాంగ్రెస్. అయితే ఇంతకుముందు రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకూ రైతు బంధు డబ్బులు అందుకున్న రైతులకు ఇప్పుడు రూ.1 నుంచి రూ.18 వరకూ డబ్బులు జమ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ వస్తే రూ.15 వేలు ఇస్తారని ఆశపడితే మరీ ఒక్క రూపాయి ఇవ్వడం ఏంటని నెత్తినోరు బాదుకుంటున్నారు కొందరు. చూస్తుంటే రైతు బంధు, ఇక బంద్ అయినట్టేనని చాలా మంది రైతులు అనుకుంటున్నారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post