Roti Pickles Are Good For Health : ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగాక రుబ్బురోళ్ల స్థానంలో మిక్సీలు, గ్రైండర్లు వచ్చి చేరాయి. ఇదివరకటి రోజుల్లో రోటిలో వేసి పచ్చడి చేసి.. వేడివేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తింటే.. ఎంత రుచిగా ఉండేదో కదా..!? అన్నమంతా ఆ పచ్చడితోనే తినేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో రోటి పచ్చడికి నగరవాసులే కాదు పల్లె ప్రజలు కూడా దూరమవుతున్నారు.
అయితే మిక్సీలో వేసిన పచ్చళ్ళతో పోలిస్తే.. మసాలాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్ వంటి పోషకాలన్నీ రోటీ పచ్చడి ద్వారా మన శరీరానికి అందుతాయి. పచ్చడి బండతో దంచటం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు, స్టెరోల్స్, ఫ్లేవనాయిడ్స్ లాంటివి బయటికి విడుదలవుతాయి. కానీ మిక్సీ, గ్రైండర్‌లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వేడి వల్ల ఇవన్నీ నశిస్తాయి.
ప్రయోజనాలు :
* అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు రోటీ పచ్చళ్లు తినడం వల్ల పొట్టలో ఉండే బ్యాక్టీరియా సామర్థ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి.
* విటమిన్ D, B12 లోపం ఉన్నవాళ్లు రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
* రోటీ పచ్చడి తినడం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది.
* కొలెస్ట్రాల్‌తో బాధపడే వారు కూడా రోటి పచ్చళ్లను హ్యాపీగా తినచ్చు. బరువును, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
* అలాగే సంతాన సమస్యలతో బాధపడే వారు కూడా పచ్చళ్లను తీసుకోవడం మంచి ఫలితం ఉంటుంది.
రోజువారి ఆరోగ్యానికి అనేక రకాల రోటీ పచ్చళ్లు తోడ్పడతాయి. వాటిలో పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో చేసుకునే పచ్చళ్లు ఉన్నాయి. ఇడ్లీ, దోసె, వడ.. వంటి టిఫిన్స్ తో పాటు చాలామందికి భోజనంలో కూరతో పాటు పచ్చడి లేనిదే ముద్దదిగదు. అయితే మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేక స్ధానాన్ని పచ్చళ్లు అక్రమించాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ రోటీ పచ్చళ్లు చేసేప్పుడు వాటిలో ఉప్పుకారాలు తగ్గించి వేసుకోవాలి. అధిక మోతాదులు తీసుకుంటే రక్తపోటు వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.