Rohit Vemula Death Case : 8 ఏళ్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఈ ఆత్మహత్యను ప్రభుత్వ వైఫల్యంగా నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, హుటాహుటీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాలిపోయి, విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మొట్టమొదటిసారి ‘అసహనం’ అనే మాట, మీడియాని ఊపేసింది.
Importance of NOTA : నోటాకు ఓటేస్తే.. ప్రయోజనం ఏంటి..!?
రోహిత్ వేములను కొందరు సీనియర్లు ర్యాంగింగ్ చేయడం వంటి వీడియోలు బయటికి వచ్చాయి.. దీంతో అతనిది ఆత్మహత్య కాదు, హత్యే అనే అనుమానాలు రేగాయి.. 8 ఏళ్లు ఈ కేసు విచారణ కదలకుండా సాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే రోహిత్ వేముల ఆత్మహత్య కేసును కొట్టివేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని, ఒత్తిడి తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నట్టుగా రిపోర్ట్ ఇచ్చింది.
రోహిత్ వేముల సూసైడ్ కేసు కొట్టేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. విద్యార్థి సంఘాలు కూడా వీరికి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. కేసును మళ్లీ తిరిగి విచారించాలని, అందుకి అనుమతి ఇవ్వాలని కోరుతో కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి రోహిత్ వేముల ఆత్మహత్య రాజకీయం తెరపైకి రావడం విశేషం..